harish: స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరేస్తాం

స్థానిక ఎన్నికల్లో గులాబీ జెండా ఎగురవేస్తామని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్‌రావు ధీమా వ్యక్తం చేశారు. స్థానిక ఎన్నికలపై ఈ మధ్య సర్వే చేయిస్తే.. తెలంగాణలో మొత్తం 31 జిల్లా పరిషత్‌లు ఉంటే.. 16 నుంచి 18 స్థానాలని బీఆర్ఎస్ కైవసం చేసుకోబోతోందని ఆ సర్వేలో తేలిందని తెలిపారు. స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌ని ఓడించాలని పిలుపునిచ్చారు. ప్రజ్ఞాపూర్‌లో గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో హరీష్‌రావు పాల్గొని బీఆర్ఎస్ శ్రేణులకి దిశానిర్దేశం చేశారు. ఈ సమావేశంలో ఎమ్మెల్సీ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా హరీష్‌రావు మీడియాతో మాట్లాడారు. అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్ గజ్వేల్ అని ఉద్ఘాటించారు. రేవంత్ ప్రభుత్వం అన్నదాతలని ఇబ్బందులకు గురిచేస్తోందని మాజీమంత్రి హరీష్‌రావు విమర్శించారు. బీఆర్ఎస్ హయాంలో రైతులు ఎరువులకు లైన్లో నిలబడ్డ దాఖలాలు లేవని.. రేవంత్ ప్రభుత్వంలో ఇప్పుడు ఎకరానికి ఒకటే బ్యాగ్ అంటున్నారని... మళ్లీ లైన్లలో నిలబడే పరిస్థితి తీసుకువచ్చారని మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com