TG: బడ్జెట్ పేరుతో గాలి మేడ కట్టారు: హరీశ్

TG: బడ్జెట్ పేరుతో గాలి మేడ కట్టారు: హరీశ్
X
బడ్జెట్ ప్రసంగంలో కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు... హామీలు ఇచ్చి అమలు మర్చిపోయారన్న హరీశ్

కాంగ్రెస్ ప్రభుత్వం బడ్జెట్ పేరుతో గాలి మేడ కట్టిందని హరీశ్ రావు విమర్శించారు. ప్రభుత్వ భూములు అమ్మితే ఆనాడు కాంగ్రెస్ విమర్శించిందని... ఇప్పుడు అవే భూములు అమ్ముతున్నారని మండిపడ్డారు. తెలంగాణలో వాహనాల అమ్మకాలు భారీగా తగ్గాయని హరీశ్ అన్నారు. దివ్యంగా ఉన్న రాష్ట్రాన్ని దివాళా తీయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్థిక మాంద్యం వల్ల కాదు బుద్ధి మాంద్యం వల్లే తెలంగాణ అభివృద్ధి ఆగిపోయిందన్నారు. ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల అమలు ఏమైందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు ప్రశ్నించారు. గతేడాది బడ్జెట్‌కు ఈ ఏడాది బడ్జెట్‌కు ప్రభుత్వం బేరీజు వేసుకోవాలని హరీశ్ సూచించారు. మహిళలకు వడ్డి లేని రుణాల హామీ ఏమైందన్నారు. హామీలు ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అమలు చేయడం మాత్రం మరచిపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.

సభలో హరీశ్ vs మంత్రులు

బడ్జెట్ ప్రసంగంలో హరీశ్ చేసిన వ్యాఖ్యలతో ఉద్రిక్తత నెలకొంది. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్థిక మాంద్యం వల్లే తెలంగాణ అభివృద్ధి ఆగిపోయిందని హరీశ్ ఆరోపించారు. దీనిపై స్పీకర్ అభ్యంతరం వ్యక్తం చేశారు. బుద్ధి మాంద్యం వ్యాఖ్యలపై మంత్రులు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అడ్డగోలుగా మాట్లాడితే తమ సభ్యులు నిశ్శబ్దంగా ఉండబోరని శ్రీధర్ బాబు వెల్లడించారు.

బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి షాక్

ఎల్బీనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి మరో షాక్ తగిలింది. ఈనెల 27న విచారణకు హాజరు కావాలని సుధీర్ రెడ్డిని మహిళా కమిషన్ ఆదేశించింది. తనపై ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ ఉమెన్ కమిషన్ చైర్‌పర్సన్‌కు హస్తినాపురం కార్పొరేటర్ సుజాత నాయక్ ఫిర్యాదు చేశారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉన్న మహిళ కార్పొరేటర్‌పై ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో మహిళా కమిషన్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tags

Next Story