Kailash Choudhary: ‘భారత్ మాతా కీ జై’ అంటేనే దేశంలో చోటు..

భారత్ మాతాకీ జై అంటేనే దేశంలో ఉండాలని, అలా పిలవని వారు పాకిస్తాన్ కు వెళ్లిపోవాలని కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి వివాదాస్పద వ్యాఖ్యలు వ్యవసాయశాఖ సహాయమంత్రి అయిన ఆయన బీజేపీ హైదరాబాద్‌లో నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో శనివారం నిర్వహించిన బీజేపీ రైతు సదస్సుకు హాజరయ్యారు. అనంతరం ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భారత్ మాతా కీ జై అనాల్సిందేనని, అలా అనని వారికి ఇక్కడ చోటు లేదని, అలాంటి వారిని ఇక్కడ ఉండేందుకు తాము అంగీకరించబోమని పేర్కొన్నారు. ఇక కాంగ్రెస్.. ఇండియా పేరిట కూటమి ఏర్పాటు చేసిందని, ఇది ఘమండి, ఘట్ బంధన్ కూటమి అని ఆయన విరుచుకుపడ్డారు.
గతంలో గాంధీ పేరును అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ దోచుకుందని, ఇప్పుడు ఇండియా పేరుతో లూటీ చేయాలని చూస్తోందని మండిపడ్డారు. ఒకప్పుడు రైతులు వలస వెళ్లేవారని, కానీ నేడు ఆ పరిస్థితి మారిందన్నారు. ఇతర దేశాల్లోలాగా డ్రోన్ వ్యవసాయాన్ని దేశానికి పరిచయం చేసిన ఘనత మోడీకి దక్కిందన్నారు.
హైదరాబాద్‌లో ప్రజాప్రతినిధులు వాడుతున్న భాషను ఉద్దేశించి మాట్లాడుతూ.. వారికి గుణపాఠం చెప్పాల్సిందేనని, రాష్ట్రం (తెలంగాణ)లో జాతీయవాద ఆలోచనలతో కూడిన ప్రభుత్వం ఏర్పడాలని అన్నారు. తెలంగాణకు అందాల్సిన నీళ్లు కూడా అందించడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని మండిపడ్డారు.రాష్ట్రంలో 24 గంటలు కరెంట్ అని మోసం చేశారని, వచ్చే కొద్ది కరెంటు కూడా ట్రిప్ అయి వస్తోందని కేంద్ర సహాయ మంత్రి కైలాశ్ చౌదరి ధ్వజమెత్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com