ఏపీ విద్యార్థినికి మెడికల్ వెబ్ ఆప్షన్ ఇవ్వండి: తెలంగాణ హైకోర్టు

X
By - Vijayanand |5 Aug 2023 12:18 PM IST
ఏపీ విద్యార్థినికి మెడికల్ వెబ్ ఆప్షన్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. తెలంగాణ ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్‌లకు సంబంధించిన కౌన్సెలింగ్‌లో ఓ ఏపీ విద్యార్థినికి వెబ్ ఆప్షన్ ఇచ్చే అవకాశం కల్పించాలని కాళోజీ హెల్త్ యూనివర్సిటీ, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. 2014 తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో కన్వీనర్ కోటా సీట్లు 100శాతం తెలంగాణ విద్యార్థులకే కేటాయిస్తూ రాష్ట్ర ప్రభుత్వం జీవో 72జారీచేసింది. ఈ జీవోను సవాల్ చేస్తూ ప్రకాశం జిల్లాకు చెందిన సాయిభావన హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com