HC: నేడు స్థానిక ఎన్నికలపై హైకోర్టులో విచారణ

స్థానిక సంస్థల ఎన్నికలపై సోమవారం హైకోర్టులో జరిగాల్సిన విచారణ వాయిదా పడింది. చీఫ్ జస్టిస్ సెలవులో ఉండటంతో వాయిదా వేయాల్సి వచ్చింది. నేడు హైకోర్టులో విచారణ జరిగే అవకాశం ఉంది. ప్రభుత్వం, ఎలక్షన్ కమిషన్ ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమని కోర్టుకు తెలిపాయి. సోమవారం తీర్పు వస్తే నేటి కేబినెట్ భేటీలో నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించినా.. , విచారణ వాయిదాతో సస్పెన్స్ కొనసాగుతోంది. హైకోర్టు నిర్ణయం వెలువరిస్తే ఆ నిర్ణయం ఆధారంగా నేడు జరగబోయే కేబినెట్ భేటీలో ఎన్నికలపై డిసిషన్ తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. అనూహ్యంగా హైకోర్టులో విచారణ వాయిదా పడింది. దీంతో నేడు హైకోర్టు విచారణ జరిపితే ఎలాంటి నిర్ణయం వెలువరించబోతోంది? కేబినెట్ భేటీలో ప్రభుత్వం ఎలాంటి వ్యూహంతో ఉందనే సస్పెన్స్ కంటిన్యూ అవబోతోంది. మరోవైపు గ్రామాల్లో స్థానిక ఎన్నికల సమరంతో రాజకీయ వాతావణం వెడెక్కింది. ఇప్పటికే రిజర్వేషన్ల ప్రక్రియ కూడా పూర్తయింది.
ఈ కేసులో ఇప్పటికే ప్రభుత్వం, ఎన్నికల సంఘంఎన్నికలకు సిద్దంగా ఉన్నామని హైకోర్టుకు వివరించాయి.హైకోర్టు నిర్ణయం వెలువడిన పిదప మంగళవారం జరుగాల్సిన తెలంగాణ కేబినెట్ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికలపై నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం భావించింది. హైకోర్టు విచారణ వాయదా పడటంతో కోర్టు నిర్ణయం వెలువడిన పిదపనే కేబినెట్ భేటీ కానున్నట్లుగా సమాచారం. స్థానిక ఎన్నికలకు సంబంధించి గత విచారణ సందర్భంగా హైకోర్టు సూచించిన మేరకు పాత రిజర్వేషన్ల మేరకు ప్రభుత్వం ఎన్నికలకు సిద్దమైంది. సర్పంచ్ లు, వార్డు సభ్యుల రిజర్వేషన్లను సైతం వెలువరించింది. రిజర్వేషన్లను గెజిట్ చేసి ఎన్నికల సంఘానికి పంపించేందుకు కావాల్సిన కసరత్తు పూర్తి చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

