HCUకు అరుదైన గుర్తింపు

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీకి అరుదైన గుర్తింపు లభించింది. యూనివర్శిటీ విభాగంలో దేశంలోనే ప్రథమ స్థానంలో నిలిచింది. ఈ మేరకు నేచర్ ఇండెక్స్ సంస్థ ప్రకటన చేసింది. అంతర్జాతీయ జర్నల్‌గా ప్రపంచంలోనే పేరొందిన నేచర్ ఇండెక్స్ సంస్థ పలు పరిశోధన పత్రాలను ప్రచురించడంతోపాటు విశ్వవిద్యాలయాలు, సాంకేతిక పరిజ్ఞాన సంస్థల పనితీరును విశ్లేషిస్తుంది. ఆయా విశ్వవిద్యాలయాలు, సాంకేతిక పరిజ్ఞాన సంస్థల పరిశోధన పత్రాల ర్యాంకింగ్‌లను పరిగణనలోకి తీసుకుంటుంది. విభిన్నంగా, నాణ్యంగా ఉన్న పత్రాలను అన్నికోణాల్లో పరిశీలించి అత్యుత్తమమైన వాటిని ఎంపిక చేస్తుంది. వాటి ద్వారా సమాజానికి జరిగిన, జరగనున్న మేలు, భవిష్యత్తులో రాబోయే మార్పులను విశ్లేషిస్తుంది. ఈ నివేదికలో యూనివర్సిటీ ఆఫ్ ఢిల్లీ, యూనివర్సిటీ ఆఫ్ కోల్‌కతా, యూనివర్సిటీ ఆఫ్ మద్రాస్ వంటి దిగ్గజ విశ్వవిద్యాలయాలను తోసిరాజని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీ తొలిస్థానంలో నిలిచింది.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com