జమునా హేచరీస్ పిటిషన్‌పై హైకోర్టులో విచారణ..

మాజీ మంత్రి ఈటెల రాజేందర్‌కు సంబంధించిన జమునా హేచరీస్ వ్యవహారంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. మెదక్ కలెక్టర్ ఇచ్చిన నివేదిక తప్పులతడకగా ఉందంటూ పిటిషన్ వేసింది జమునా హేచరీస్. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా హేచరీస్‌లోకి వెళ్లి.. విచారణ చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని పిటిషన్‌లో కోరారు.
విచారణ చేపట్టిన హైకోర్ట్.. నియమ నిబంధనలు పాటించకుండా.. ప్రభుత్వం తీసుకున్న చర్యలు చట్ట విరుద్దమని వ్యాఖ్యానించింది.అధికారులు ముందస్తు నోటీసులు జారీ చేశారా? ఒకవేళ చేస్తే ఆ నోటీసులు కోర్టుకు చూపించాలని ఆదేశించింది. పూర్తి వివరాలు సమర్పించాలన్న హైకోర్టు.. తదుపరి విచారణ మధ్యాహ్నం రెండున్నరకు వాయిదా వేసింది.
మొత్తం పూర్తి చేశారంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎలాంటి అవగాహన లేకుండా హుటాహుటిన నివేదిక ఇచ్చారని తెలిపారు. నిబంధనలు అధికారులు తుంగలో తొక్కారని.. ఈ చర్యలన్నీ ప్రీ ప్లాన్‌గా జరిగాయని హైకోర్టుకు విన్నవించారు.
నివేదిక పత్రాన్ని ఇప్పటి వరకు పిటిషనర్‌కు ఇవ్వలేదని.. అధికారుల కంటే ముందే పలువురు మీడియా ప్రతినిధులు ఆ సర్వే భూముల్లోకి ఎలా వెళ్తారని పిటిషనర్ తరపు న్యాయవాది కోర్టుకు వివరించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com