Telangana: అత్యంత భారీ వర్ష సూచన

తెలంగాణకు అత్యంత భారీ వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. పలు జిల్లాల్లో రేపట్నుంచి మూడ్రోజుల పాటు భారీ నుంచి అతి భారీ వర్షాలతో పాటు అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు.. ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ.. సూర్యాపేట, జనగామ, సిద్దిపేట జిల్లాల్లో అక్కడక్కడా భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక.. జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి.. యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో కొన్నిచోట్ల భారీ వర్షాలు కురవనున్నాయి. గంటకు 40 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీచే అవకాశమున్నట్లు వాతావరణ శాఖ హెచ్చరించింది.
24 గంటల్లో బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని.. అది 26వ తేదీ నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. ఈ వాయుగుండం పశ్చిమ వాయువ్య దిశగా కదులుతూ ఉత్తరాంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిశా తీరాలకు చేరే అవకాశం ఉందని తెలిపింది. ఈ నేపథ్యంలో వచ్చే మూడు రోజులు తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది.
Tags
- heavy rains in telangana
- rains in telangana
- telangana news
- telangana rains
- heavy rains
- heavy rains in hyderabad
- heavy rains falls in telangana
- telangana heavy rains
- rain alert to telangana
- heavy rains in telangana & hyderabad
- heavy rain alert for telangana
- yellow alert in telangana
- heavy rains in telangana for next four days
- heavy rains in ap
- rain alert for telangana
- heavy rain in hyderabad
- telangana latest news
- telangana
- heavy rain alert in telangana
- tv5news
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com