హైదరాబాద్‌లో ఈదురుగాలులతో కూడిన వర్షం

హైదరాబాద్లో శుక్రవారం ఉదయం ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం పడింది. శంషాబాద్ ఎయిర్ పోర్ట్, బషీర్ బాగ్ , బేగంబజార్, కోఠి, మీర్ పేట్, చాంద్రాయణగుట్ట, ఫలక్ నుమా, ఛత్రినాక, శాలిబండ తదితర ప్రాంతాల్లో గాలితో కూడుకున్న భారీ వర్షం పడింది. దిల్ షుఖ్ నగర్,మలక్ పేట, చైతన్య పురి, కొత్తపేట తేలికపాటి వర్షాలు కురిశాయి. రాజేంద్రనగర్ వ్యవసాయ యూనివర్సిటీ బ్యాక్ సైడ్ రాజేంద్రనగర్ జోన్ డీసీపీ కార్యాలయం ప్రాంగణంలో పిడుగుపాటుకు కొబ్బరి చెట్టు కాలిపోయింది.
ఉదయం ఎండలు, సాయంత్రం వర్షాలతో నగర వాసులు ఇబ్బంది పడుతున్నారు. ఎండలు ఎక్కువవడంతో జనం కూడా బయటకు వెళ్లాలంటే ఆలోచిస్తున్నారు. సాయంత్రం కాగానే బయటకు వెళ్దామనుకునే సరికి వర్షాలు పడుతున్నాయి. ఈ అకాల వర్షాలు జనాన్ని ఆందోళనకు గురి చేస్తున్నాయి. గ్రామాల్లో వరి చేన్లు, మామిడి తోటలు దెబ్బతింటున్నాయి. రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com