Hyderabad Rains : నగరంలో దంచికొడుతున్న వాన..

Hyderabad Rains : నగరంలో దంచికొడుతున్న వాన..
మరి కొన్ని గంటలపాటు ..

హైదరాబాద్ నగరంలో సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భారీ వర్షం దంచి కొట్టింది. దీంతో లోతట్టు ప్రాంతాలు, రహదారులు జలమయమయ్యాయి. ప్రజలు, వాహనదారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జాం ఏర్పడింది. రోడ్లపైకి వరదనీరు చేరడంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా అప్రమత్తతో ఉండాలని జీహెచ్ఎంసీ కమిషనర్ సూచించారు. భారీ వర్షాలకు జంట నగరాలు జలాశయాల్లా మారిపోయాయి.

హైదరాబాద్ నగరంలో దాదాపు అన్ని ఎడతెరిపిలేకుండా భారీ వర్షం కురుస్తోంది. ఖైరతాబాద్, సోమాజిగూడ, పంజాగుట్ట, అమీర్‌పేట్, కూకట్‌పల్లి, హైదర్ నగర్, నిజాంపేట్, కేపీహెచ్‌బీ కాలనీ, నాంపల్లి, మలక్ పేట్, సైదాబాద్, పాతబస్తీ, ఎల్బీనగర్, సాగర్‌రింగ్ రోడ్, హస్తినాపురం, సికింద్రాబాద్ , బేగంపేట్, మారేడుపల్లి, ప్యాట్నీ, ప్యారడైజ్, చిలకలగూడ, బోయిన్‌పల్లి, తిరుమలగిరి, అల్వాల్, బొల్లారం వర్షం జోరుగా కురుస్తోంది.


దీంతో అవసరమైతేనే బయటికి రావాలని వాతావరణ శాఖ, జీహెచ్ఎంసీ అధికారులు సూచిస్తున్నారు. ప్రైవేట్ ఉద్యోగులు వర్క్ ఫ్రం హోం చేసుకుంటే మంచిదని చెబుతున్నారు. మియాపూర్ లో అత్యధికంగా 14.7 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయింది. లింగంపల్లి అండర్పాస్ వద్ద భారీగా వర్షం నీళ్లు, రాకపోకలకు ఇబ్బందులు ఏర్పడ్డాయి. పలు ప్రాంతాల్లో నాలా పొంగి వరద నీరు రోడ్లపై ప్రవహిస్తోంది. వర్షం కారణంగా రాజేంద్ర నగర్ జంట జలాశయాలకు భారీగా వరద వస్తోంది. దీంతో హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ రెండు గేట్లు ఎత్తివేశారు. మరి కాసేపట్లో మరో నాలుగు గేట్లు ఎత్తే అవకాశం ఉంది . మూసీ నది ఉదృతంగా ప్రవహిస్తోంది.జంట జలాశయాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుండడంతో అధికారులు పరిసర ప్రాంతాల వాసులను అప్రమత్తం చేశారు.


ఏదైనా సమస్య ఉంటే జీహెచ్ఎంసీ హెల్ప్‌లైన్ నెంబర్ ఏర్పాటు చేశారు. 040-21111111 or 9000113667 నెంబర్లను సంప్రదించాలని కోరారు. 100కి కూడా కాల్ చేయాలని సూచించారు.

ఈశాన్య బంగాళాఖాతం, దాని పరిసర ప్రాంతాలలో కేంద్రీకృతమై ఉన్న ఆవర్తన ప్రభావం వల్ల పశ్చిమ బంగాళాఖాతంలో రాబోయే 48 గంటల్లో అల్పపీడ ప్రాంతం ఏర్పడే అవకాశం ఉంది. దీంతో నిజామాబాద్, జగిత్యాల్, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, వికారాబాద్, సంగారెడ్డి, కామారెడ్డి, మహబూబ్ నగర్, నారాయణపేట జిల్లాలకు అతిభారి వర్షాలు కురిసే అవకాశం ఉంది.

Tags

Next Story