HYD Rain: భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్ట ప్రాంతాలన్ని జలమయం

HYD Rain: భాగ్యనగరంలో భారీ వర్షం.. లోతట్ట ప్రాంతాలన్ని జలమయం
HYD Rain : భాగ్యనగరంలో మళ్లీ వర్షం కురుస్తోంది. దిల్ సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, కుషాయిగూడ, చెంగిచెర్లలో భారీవర్షం కురిసింది.

హైదరాబాద్లో మళ్లీ వర్షం కురుస్తోంది. దిల్ సుఖ్‌నగర్‌, సరూర్‌నగర్‌, కుషాయిగూడ, చెంగిచెర్ల, అంబర్పేట్, చెంగిచర్లలో ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురుస్తోంది. దీంతో లోతట్టు ప్రాంతాలన్ని జలమయం అయ్యాయి. ఈనేపథ్యంలో నగరవాసులు అత్యవసరం అయితే తప్ప బయటికి రావొద్దని జీహెచ్‌ఎంసీ హెచ్చరించింది. వరద నీటితో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అల్పపీడనం నేపథ్యంలో మరో రెండు రోజులు భారీ వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

రాష్ట్రంలో అండమాన్‌ సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం కారణంగా వాయవ్య దిశగా బలమైన గాలులు వీస్తాయని ఐఎండీ అధికారులు తెలిపారు. రాగల 48 గంటల్లో అల్పపీడనం మరింత బలపడి.. పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి.. మధ్యప్రదేశ్, గుజరాత్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్, బెంగాల్, ఒడిస్సాల మీదుగా ఉత్తర కోస్తాంధ్ర తీరం చేరుకునే అవకాశముందని స్పష్టం చేశారు. దీంతో మరో రెండు రోజులు తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story