బాబోయ్.. మళ్లీ భారీ వర్షాలు..

బాబోయ్.. మళ్లీ భారీ వర్షాలు..
రెండు, మూడు రోజుల నుంచి కాస్త వరుణ దేవుడి కరుణించాడనుకున్నాం..

రెండు, మూడు రోజుల నుంచి కాస్త వరుణ దేవుడి కరుణించాడనుకున్నాం.. కానీ మళ్లీ అంతలోనే భారీ వర్షాలు అంటూ పిడుగులాంటి వార్త అందించింది వాతావరణ శాఖ. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మంగళవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. తెలంగాణలోని కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది.

ఈ మేరకు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. సోమవారం తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. కానీ గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడు వర్షపాతం తక్కువగా నమోదైందని వాతావరణ కేంద్రం తెలియజేసింది. గత ఏడాదికి ఇదే సమయానికి 687.1 మిల్లీ మీటర్ల వర్షం పడగా, ఈ ఏడాది ఇప్పటివరకు 559.1 మిల్లీమీటర్లు కురిసిందని తెలిపింది.

Tags

Next Story