Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలెర్ట్ .. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల ఎఫెక్ట్

Trains Cancelled : రైల్వే ప్రయాణికులకు అలెర్ట్ .. తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాల ఎఫెక్ట్
X
86 రైళ్లు రద్దు

రెండు తెలుగు రాష్ట్రాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా దక్షిణ మధ్య రైల్వే కీలక ప్రకటన చేసింది. ఈ మేరకు మొత్తం 80 రైళ్లు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా మరో 48 ట్రైన్లను దారి మళ్లిస్తు్న్నట్లుగా పేర్కొన్నారు. ఈ క్రమంలో విశాఖపట్నం నుంచి కడప వెళ్లే తిరుమల ఎక్స్‌ప్రెస్‌‌ను కూడా అధికారులు రద్దు చేశారు. విశాఖపట్నం నుంచి విజయవాడ వెళ్లే రత్నాచల్‌ ఎక్స్‌ప్రెస్‌‌ను భీమవరం మీదుగా దారి మళ్లించారు. అక్కడ పూర్తిగా ట్రాక్‌లు పూర్తిగా వరద నీటికి కొట్టుకుపోవడంతో టైన్ల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ఇక కాజీపేట, రాయనపాడులో ట్రాక్‌‌లు తెగిపోవడంతో రైళ్లను పూర్తిగా అధికారులు ఎక్కడికక్కడ నిలిపివేశారు.

భారీ వర్షాల కారణంగా రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. దీంతో విజయవాడతోపాటు డివిజన్‌ వ్యాప్తంగా అన్ని ముఖ్య రైల్వే స్టేషన్లలో ప్రయాణికులు ఇబ్బందులు పడ్డారు. రైళ్ల రద్దు విషయం అప్పటికప్పుడు తెలియడంతో ప్రయాణికులు స్టేషన్లలో నిలిచిపోయారు. టికెట్ల రద్దు కోసం అధికారులు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేశారు. ట్రాక్‌ దెబ్బతిన్న ప్రాంతాల్లో పునరుద్ధరణ పనులను యుద్ధప్రాతిపాదికన చేపట్టారు. సికింద్రాబాద్‌ మార్గంలో ట్రాక్‌ కొట్టుకుపోవటంతో పలు రైళ్లను మార్గమధ్యలోనే నిలిపివేశారు. రైళ్లు ఎప్పుడు కదులుతాయో తెలియక ప్రయాణికులు నానా అవస్థలు పడ్డారు. విజయవాడ మీదుగా నడిచే పలు రైళ్లను రెండ్రోజుల పాటు రద్దు చేయడంతో పాటు దారి మళ్లిస్తున్నట్లు రైల్వే అధికారులు ఆదివారం ప్రకటించారు. విజయవాడ కంట్రోల్‌ రూమ్‌ నుంచి డీఆర్‌ఎం నరేంద్ర ఆనందరావు పాటిల్‌ పరిస్థితిని సమీక్షిస్తున్నారు.

భారీగా బస్సు సర్వీసులు రద్దు

తెలంగాణలో కీలకమైన హైదారాబాద్ - విజయవాడ మార్గంలోని జాతీయ రహదారిపై పలుచోట్ల వరద ప్రవహిస్తోంది. దీంతో టీజీఎస్‌ ఆర్టీసీ 560కి పైగా బస్సులను రద్దు చేసింది. రద్దైన వాటిలో ఖమ్మం జిల్లాలో 160, వరంగల్ 150, రంగారెడ్డి జిల్లాలో 70కిపైగా బస్సులున్నాయి.

Tags

Next Story