రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనం.. వాయు'గండం'..

X
By - prasanna |14 Oct 2020 11:03 AM IST
జాతీయ రహదారులపై ట్రాఫిక్ జామ్ భారీగా స్థంభించి పోతోంది.
హైదరాబాదుకు పశ్చిమంగా 50 కిలోమీటర్ల దూరంలో తీవ్ర వాయుగుండం కేంద్రీకృతమై ఉంది. రాగల 12 గంటల్లో తీవ్ర అల్పపీడనంగా వాయుగుండం బలహీనపడనుందని వాతావరణ శాఖ తెలిపింది. ఈరోజు తేలిక పాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. మరో వైపు నిన్న రాత్రి కురిసిన వర్షానికి పలు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
అనేక కాలనీలు జలదిగ్భంధంలో చిక్కుకున్నాయి. పాత బస్తీలో భారీ వర్షాలకు ఇల్లు కూలి 9 మంది మృతి చెందారు. మరో రెండు రోజులు వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వీలైనంత వరకు బయటకు రావొద్దని నగరపాలక సంస్థ అధికారులు హెచ్చరిస్తున్నారు. జాతీయ రహదారులపై ట్రాఫిక్ జామ్ భారీగా స్థంభించి పోతోంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com