హైదరాబాద్‌లో భారీ వర్షం

హైదరాబాద్‌లో భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం వరకు ఎండల తీవ్రతతో ఉక్కిరి బిక్కిర అయిన నగరవాసులు ఒక్కసారిగా కురిసిన భారీ వర్షంతో సేదతీరారు. ఏకదాటిగా కురిసిన వర్షానికి నగరంలోని లోతట్టు ప్రాంతాలన్నీ జలమయం అయ్యాయి. రహదారులపైకి భారీగా వరద నీరు రావడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తార్నాక, రాంనగర్, ఉస్మానియా యూనివర్సిటీ, లాలాపేట, సికింద్రాబాద్, బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, నాంపల్లితో పాటు పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలోనూ ఓ మోస్తరు నుంచి భారీ వర్షం పడింది.
మరోవైపు రాగల మూడురోజుల్లో తెలంగాణలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాపాతం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో వర్షంతో పాటు అక్కడక్కడ వడగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com