నాగర్ కర్నూలు జిల్లాలో భారీ వర్షాలు.. నీటిలో చిక్కుకుపోయిన అంబులెన్స్

నాగర్ కర్నూలు జిల్లాలో రాత్రి నుంచి ఎడతెరుపు లేకుండా వర్షలు కురుస్తున్నాయి. దీంతో.. శ్రీశైలం-మహబూబ్‌నగర్ ప్రధాన రహదారి పూర్తిగా నీటిలో మునిగిపోవడంతో వాహనాల రాకపోకలకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. తాజాగా ఒక అంబులెన్స్ నీటిలో చిక్కుకుపోయింది. అనారోగ్యంతో ఉన్న పేషెంట్‌ను హైదరాబాద్ తీసుకెళ్తుండగా రహదారిపై వరద ఉధృతిలో అంబులెన్స్ నిలిచిపోయింది. లోపల సీట్ల వరకు నీళ్ళు చేరడంతో ఆందోళన నెలకొంది. అర్ధరాత్రి మూడు గంటల పాటు ఏం చేయాలో పాలుపోని స్థితిలో అందులో ఉన్నవారు టెన్షన్ పడ్డారు. స్థానిక యువకులంతా చొరవ తీసుకుని అంబులెన్స్‌ను బయటకు తెచ్చారు.
శ్వాస ఇబ్బంది కారణంగా ఆక్సిజెన్ సిలెండర్‌తో అంబులెన్స్‌లో ప్రాణపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడేందుకు స్థానికులు దాదాపు కిలోమీటర్‌పాటు అంబులెన్స్‌ను తోసుకుని వచ్చారు. తీరా నీళ్ల నుంచి బయటకువ వచ్చినా అంబులెన్స్ స్టార్ట్ కాలేదు. దీంతో.. మరో అంబులెన్స్‌ను పిలిచి రోగిని హైదరాబాద్ తరలించారు. అంబులెన్స్‌తోపాటు పది కార్లు, కొన్ని బైక్‌లు కూడా నీటిలో ఇరుకున్నాయి. అటు, చుట్టుపక్కల కాలనీల్లోకి సైతం వరద నీరు చేరడంతో.. రాత్రంగా అక్కడ టెన్షన్ వాతావరణం కనిపించింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com