Nalgonda: నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు

ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. భారీ వర్షాలకు జిల్లాలోని వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరద కారణంగా పంటపొలాలు చెరువులను తలపిస్తున్నాయి. సూర్యాపేట జిల్లా గుండాల సమీపంలో బిక్కేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో గుండాల- నూనెగూడెం, గంగపురం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అటు ఆత్మకూరులో కుండపోత వర్షం కురుస్తోంది.
భారీ వర్షాలకు ముకుందాపురం రహదారి నీటిలో మునిగిపోయింది. మరోవైపు నిర్మాణంలో ఉన్న అప్రోచ్ రోడ్డు మునిగిపోవడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. మరోవైపు సూర్యపేట పరిధిలో వర్షాలు దంచికొడుతున్నాయి. దంతాలపల్లి-సూర్యపేట రహదారిపై భారీగా వరద నీరు ప్రవహిస్తుంది. భారీ వర్షాల కారణంగా వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను అప్రమత్తం చేశారు మంత్రి జగదీస్ రెడ్డి. వర్షాలు, వరదల నేపథ్యంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అధికారులతో సమీక్షించారు. ఈ సందర్బంగా అధికారులకు పలు సూచలను చేశారు.
Tags
- heavy rains in nalgonda
- heavy rains in telangana
- heavy rains
- rains in telangana
- rains in nalgonda
- heavy rains in nalgonda dist
- nalgonda rains
- heavy rains in nalgonda district
- heavy rains in hyderabad
- heavy rain in nalgonda
- nalgonda
- heavy rain
- heavy rains in across nalgonda
- crop loss with heavy rains in nalgonda
- nalgonda heavy rains
- nalgonda district
- heavy rains in nalgonda district || roads turn lakes
- heavy rains lash nalgonda
- rains lash in nalgonda
- tv5news
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com