Yadadri Rains : యాదాద్రిని ముంచెత్తుతున్న భారీ వర్షాలు..

Yadadri Rains : యాద్రాద్రి భువనగిరి జిల్లాను వర్షాలు ముంచెత్తుతున్నాయి. భారీ వర్షాలకు ధర్మారం చెరువు పొంగిపొర్లుతుంది. దీంతో పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి.అయితే గ్రామాల మధ్య హైలెవల్ కల్వర్టులు నిర్మించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.వరద ప్రవాహంతో పంటపొలాలు మనిగి కోతకు గురవుతున్నాయి.
మరోవైపు గత రెండు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు యాదాద్రి భువనగిరి జిల్లాలోని పెద్ద చెరువు కూడా అలుగుపోస్తుంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.సింగన్న గూడెంలో ఇళ్లు నీట మునిగాయి,జనజీవనం స్థంబించింది. రాయగిరి నుంచి యాదగిరిగుట్ట వెళ్లే మార్గంలో వరద నీరు భారీగా ప్రవహించడంతో ఆ ప్రాంతం చెరువును తలపిస్తోంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
ఇక జిల్లాలోని ఆత్మకూర్ లో కూడా భారీ వర్షం కురువడంతో బిక్కేరు వాగు పొంగిపొర్లడంతో కొరిటికల్ బిడ్జ్రిపై నుంచి వరద నీరు ప్రవహిస్తుంది. దీంతో మండలకేంద్రానికి రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.ఆత్మకూర్ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లే వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. రోడ్లు చెరువులను తలపిస్తుండటంతో ప్రయాణం ఓ సహసంగా మారింది.అత్యవసర పనుల మీద ఇతర ప్రాంతాలకు వెళ్లే వారు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ప్రయాణించాల్సి వస్తుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com