TG: తెలంగాణలో అతి భారీ వర్షాలు

TG: తెలంగాణలో అతి భారీ వర్షాలు
X
నేడు సీఎం రేవంత్‌రెడ్డి సమీక్ష... మళ్లీ మున్నేరుకు భారీగా వరద

తెలంగాణలో భారీ వర్షాలు, వరదల కారణంగా నష్టపోయిన ప్రజలను మరింత ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో ఇవాళ మధ్యాహ్నం 12.30 గంటలకు సచివాలయంలో.. రాష్ట్రంలో వర్షాల ప్రభావం, వరద నష్టంపై CM రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించనున్నారు. ఈ మేరకు భారీ వర్షాలు, వరదల వల్ల సంభవించిన నష్టాలపై ఈరోజు మధ్యాహ్నంలోపు కలెక్టర్లు నివేదిక ఇవ్వాలని సీఎస్ శాంతికుమారి కోరింది.

అతి భారీ వర్షాలు

తెలంగాణలో రాష్ట్రంలో రానున్న మూడు రోజులు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా మరోసారి రెండు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు సూచించారు. మూడు రోజులు కుండపోత వర్షాలు కురుస్తాయని తెలిపింది. రేపు ఐదు జిల్లాలకు, ఎల్లుండి నాలుగు జిల్లాలకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రేపు వాయుగుండంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ఇది మూడు రోజుల పాటు కొనసాగే అవకాశం ఉందని పేర్కొంది.భద్రాద్రి, ఖమ్మం, భూపాలపల్లి, మహబూబాబాద్, మెదక్, ములుగు, సూర్యాపేట జిల్లాలకు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని సూచించింది.

మున్నేరుకు భారీగా వరద

ఖమ్మం జిల్లాలో మున్నేరు వాగు విలయతాండవం చేసింది. పరివాహక ప్రాంతాలను ముంచేసింది. భారీ వరదలతో మహబూబాబాద్ ప్రాంతంలో రైల్వే ట్రాక్ కొట్టుకుపోయింది. మరోసారి భారీ వర్షాలు కురిస్తాయని వాతావరణ శాఖ చెప్పడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఖమ్మంలో వరదలు కారణంగా పాఠశాలలకు ఐదు రోజులు సెలవులు ప్రకటించిన విషయం తెలిసిందే. రేపు అంటే సోమవారం కూడా ఖమ్మంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండడంతో పాటుగా మున్నేరుకు మరింత వరద నీరు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం స్కూళ్లకి సెలవు ప్రకటించారు. కాగా మున్నేరు పరివాహక ప్రాంతంలోని ఖమ్మం మున్సిపాలిటీ పరిధిలోని, ఖమ్మం రూరల్ మండలంలోని అన్ని విద్యాసంస్థలకు ఆ జిల్లా కలెక్టర్ రేపు సెలవు ప్రకటించారు.జిల్లాలోని మిగిలిన మండలాలలోని విద్యాసంస్థలు రేపటి నుండి యధావిధిగా పనిచేయాలని ఆదేశాలు జారీ చేశారు.

Tags

Next Story