ర్యాపిడ్ టెస్టుల కంటే RTPCR టెస్టులు పెంచాలి : తెలంగాణ హైకోర్టు

తెలంగాణలో కరోనా కేసులపై హైకోర్టు విచారణ జరిపింది. రాష్ట్రంలో కోవిడ్ టెస్టులు, చర్యలు జరుగుతున్న తీరుపై అడ్వకేట్ జనరల్ బీఎస్ ప్రసాద్ హైకోర్టుకు రిపోర్టు సమర్పించారు. అయితే మార్చి 7, 11 వ తేదీల్లో 20 వేల లోపు టెస్టులు మాత్రమే చేయడంపై హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది.
దీనిపై వివరణ ఇచ్చిన ఏజీ... సొంతంగా సేరో సర్వేలెన్స్ సర్వే చేయడానికి సమయం కావాలని కోరారు. ఇప్పటికే రాష్ట్ర సరిహద్దులు, రైల్వే, బస్ స్టేషన్లలో 300 మొబైల్ కేంద్రాల్లో టెస్టులు చేస్తున్నామని చెప్పారు. దీనిపై స్పందించిన హైకోర్టు... కోవిడ్ కేసులు పెరుగుతున్నందున పబ్లిక్ గ్యాదరింగ్ పై ఆంక్షలు విధించాలని ఆదేశించింది.
అంత్యక్రియలు, పెళ్లిళ్లలో 100 మందికి మించరాదని, రద్దీ ప్రాంతాలు, నిర్మాణ ప్రాంతాలు, స్కూళ్లలో టెస్టులు పెంచాలని సూచించింది. అలాగే ర్యాపిడ్ టెస్టుల కంటే RTPCR టెస్టులు పెంచాలని, కేంద్రం విడుదల చేసిన SOP పాటించాలని దిశా నిర్దేశం చేసింది.
అదనపు వివరాలతో మరో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణను ఏప్రిల్ 19కి వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com