తెలంగాణలో కరోనా పరిస్థితుల పైన హైకోర్టులో విచారణ

తెలంగాణలో కరోనా పరిస్థితులపై, ప్రభుత్వ తీరుపట్ల హైకోర్టు అసంతృప్తి వ్యక్తం చేసింది. సరిహద్దు వద్ద అంబులెన్సులను అడ్డుకోవడం దారుణమని, ఏ అధికారంతో వీటిని అడ్డుకున్నారని నిలదీసింది. విపత్తు వేళ వీటిని ఆపడం మానవత్వమేనా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. రాష్ట్రంలో పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానంలో ఇవాళ విచారణ జరిగింది. రాత్రి కర్ఫ్యూ సరిగా అమలు కావడం లేదని ఆక్షేపించింది.
మతపరమైన కార్యక్రమాలను ఎందుకు నియంత్రించట్లేదు. రంజాన్ తర్వాతే వీటిపై చర్యలు తీసుకోవాలని భావిస్తున్నారా? నిబంధనల ఉల్లంఘనపై మీడియా చూపిస్తోంది. అధికారులు కోర్టు ధిక్కరణ ఎదుర్కోవాల్సి వస్తుంది. కరోనా నియంత్రణకు చర్యలు ఏంటని పేర్కొంది.ప్రభుత్వం చెప్పే విషయాలకు క్షేత్రస్థాయి పరిస్థితులకు పొంతనే లేదంది. కోర్టు ఆదేశాలు, సూచనలు బుట్టదాఖలు చేయడం బాధాకరమంది.
కరోనా నియంత్రణకు తదుపరి చర్యలు ఏంటో చెప్పండని ప్రశ్నించింది. అటు కేబినెట్ భేటీ తర్వాత అన్ని విషయాలు వెల్లడిస్తామని కోర్టుకు ఏజీ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com