తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ..!

తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు విచారణ..!
మరోవైపు కరోనా చికిత్స ఛార్జీల జీవో అమలు చేయని ఆస్పత్రులపై జరిమానా విషయం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం.

Telangana High Court : తెలంగాణలో కరోనా పరిస్థితులపై ఇవాళ హైకోర్టులో విచారణ జరిగింది. కరోనా పరిస్థితుల నేపథ్యంలో తరగతులు ఆన్‌లైన్‌లో...పరీక్షలు ఆఫ్‌లైన్‌లో నిర్వహిస్తున్నారని న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తెచ్చారు. పరీక్షల విషయంలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది. పరీక్షల విషయంలో అభ్యంతరాలుంటే..ప్రభుత్వానికి తెలుపాలని ధర్మాసనం సూచించింది.

మరోవైపు కరోనా చికిత్స ఛార్జీల జీవో అమలు చేయని ఆస్పత్రులపై జరిమానా విషయం ఏంటని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది ధర్మాసనం. జరిమానాల పెంపునకు ప్రతిపాదనలు ఉన్నాయన్న డీహెచ్‌.. కేంద్ర క్లినికల్‌ ఎస్టాబ్లిష్మెంట్ చట్టాన్ని తర్వలో స్వీకరించనున్నట్లు విన్నవించారు. కేంద్ర చట్టం స్వీకరణ త్వరగా పూర్తిచేయాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది.దివ్యాంగులు, మానసిక వికలాంగులు... హై రిస్కు జాబితాలో చేర్చాలని హైకోర్టు ఆదేశాలిచ్చింది. వెయ్యి 640 మంది నర్సుల తొలగింపుపై అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ప్రభుత్వాన్ని ఆదేశించింది.

వైద్యారోగ్యశాఖలో ఖాళీల భర్తీపై వివరాలు సమర్పించాలని హైకోర్టు కోరింది. కరోనా చికిత్స ఔషదాలపై వివరాలు సమర్పణకు కేంద్రం రెండు వారాల గడువు కోరగా...మందులను అత్యవసర జాబితాలో చేర్చేందుకు కమిటీ ఏర్పాటు చేసినట్లు హైకోర్టుకు విన్నవించింది. కేసు తదుపరి విచారణ ఆగస్టు 11కి వాయిదా పడింది.

Tags

Next Story