తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్..!

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్..!
తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది.

తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు మరోసారి సీరియస్ అయింది. రాష్ట్రంలో కరోనా పరిస్థితులపై ఉన్నత న్యాయస్థానం విచారణ జరిపింది. ఈ విచారణకు డీజీపీ మహేందర్‌రెడ్డితో పాటు పబ్లిక్ హెల్త్ ఆఫీసర్ శ్రీనివాసరావు హాజరయ్యారు. రాష్ట్రంలో కావాల్సిన టెస్టులు చేస్తున్నామని శ్రీనివాసరావు.. హైకోర్టు దృష్టి తీసుకెళ్లారు. దీనిపై అభ్యంతరం వ్యక్తం చేసిన హైకోర్టు.. టెస్టులు తగ్గించి కరోనా కేసులు తగ్గాయని ఎలా చెప్తారని ప్రశ్నించింది. కరోనా టెస్టులు ఎందుకు పెంచడం లేదని పేర్కొంది. లాన్‌డౌన్ దిశగా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని తెలిపింది. నైట్ కర్ఫ్యూ పెట్టి ప్రభుత్వం చేతులు దులుపుకుందని హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

Tags

Read MoreRead Less
Next Story