TS High Court : తెలంగాణ ప్రభుత్వ సర్క్యులర్ పై హైకోర్టు స్టే..!

రాష్ట్ర సరిహద్దుల్లో అంబులెన్సుల నిలిపివేతపై తెలంగాణ హైకోర్టు అసహనం వ్యక్తం చేసింది.. అలా అంబులెన్సులను ఆపే హక్కు ఎవరిచ్చారని రాష్ట్ర ప్రభుత్వం పై హైకోర్టు మండిపడింది. రాష్ట్ర సరిహద్దుల్లో ఆంబులెన్స్ లో నిలిపివేస్తున్నారంటూ రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి వెంకట కృష్ణారావు దాఖలు చేసిన హౌస్ మోషన్ పిటిషన్ పై ఉన్నత న్యాయస్థాన విచారణ చేపట్టింది. వాహనాలను ఆపి ఆర్టికల్ 21 ను ఉల్లంఘిస్తున్నారని కోర్టు అభిప్రాయపడింది. పేషంట్ లతో వెళ్తున్న అంబులెన్సులను ఆపడం ఎక్కడైనా చూశామా అని హైకోర్టు ప్రశ్నించింది. అటు ఈ నెల 11వ తేదీన తెలంగాణ ప్రభుత్వం ఇచ్చిన సర్క్యులర్ పై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని హైకోర్టు వెల్లడించింది. తదుపరి విచారణను జూన్ 17కి వాయిదా వేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com