లైసెన్స్ లు రద్దు కాదు..10 రెట్లు అధికంగా ఫైన్లు వెయ్యండి : హైకోర్టు

లైసెన్స్ లు రద్దు కాదు..10 రెట్లు అధికంగా ఫైన్లు వెయ్యండి : హైకోర్టు
అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న హాస్పిటల్స్ విషయంలో ఇప్పటికిప్పటికి ట్రీట్మెంట్ కి రద్దు చేసేకంటే వారికి పదిరెట్లు జరిమానా విధించాలని హైకోర్టు అభిప్రాయపడింది.

కోవిడ్ చికిత్సలో నిబంధనలు ఉల్లంఘిస్తున్న ఆస్పత్రులపై చర్యలు ఉండాల్సిందే.. ఈ విషయం ఎవరూ కాదనరు.. అడ్డగోలు దోపిడీకి పాల్పడుతున్న హాస్పిటల్స్ విషయంలో ఇప్పటికిప్పటికి ట్రీట్మెంట్ కి రద్దు చేసేకంటే వారికి పదిరెట్లు జరిమానా విధించాలని హైకోర్టు అభిప్రాయపడింది. ఇతర ఆస్పత్రులు కూడా భయపడేలా ఈ చర్యలు ఉంటే కరోనా ట్రీట్మెంట్ విషయంలో రోగులకు కాస్తయినా న్యాయం జరుగుతుందని వ్యాఖ్యానించింది.

అలాగే అధిక ఫీజులు వసూలు చేస్తున్న ఆసుపత్రుల నుంచి ఆ మొత్తాన్ని తిరిగి బాధితులకు ఇప్పించేలా ఒక ప్రణాళిక కూడా ఉండాలని అభిప్రాయ పడింది. ప్రైవేట్, కార్పొరేట్ ఆస్పత్రుల్లో కరోనా చికిత్సకి వసూలు చేసే గరిష్ట ఫీజు ఎంతో ఖరారు చేస్తూ కొత్త జీవో ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. బెడ్, నర్సింగ్ ఛార్జ్, స్కానింగ్ లు ఇతర టెస్టులకు ఎంతెంత ధరలు నిర్ణయించాలో చెప్తూ.. అన్ని వివరాలు పొందు పరచాలని స్పష్టం చేస్తోంది. అలాగే ప్రస్తుతం చర్యలు తీసుకున్న ఆసుపత్రులలో నుంచి జరిగినదానికి చింతిస్తూ. అనుమతుల పునరుద్ధరణకు వస్తే లైసెన్సు పునరుద్ధికరించాలని సూచించింది.

రోగులకు ఇబ్బంది లేకుండా ఉండేందుకే ఈ ప్రతిపాదన చేసినట్లు వివరించింది. అటు ఏఏ ఆస్పత్రిలో ఆక్సిజన్ యూనిట్లు అందుబాటులో ఉన్నాయని వివరాలపై కూడా హైకోర్టు ప్రభుత్వానికి కొన్ని ప్రశ్నలు వేసింది. బ్లాక్ ఫంగస్ చికిత్సకు మందులకు కొరత ఉందా అని ఆరాతీసింది. త్వరలోనే కరోనా వైరస్ థర్డ్ వేవ్ వస్తుందని హెచ్చరికల నేపథ్యంలో దాన్ని ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సన్నద్ధమైన నివేదిక కోరింది ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాలు, మందులు అవసరమైన సిబ్బంది లాంటి వివరాలన్నీ రిపోర్టులో పొందుపరచాలని ఆదేశించింది.

అటు బ్లాక్ ఫంగస్ సోకిన వారికి చికిత్స కోసం 1,539 పడకలు సిద్ధం చేసినట్లు డి హెచ్ ఎస్ శ్రీనివాస్ కోర్టుకు తెలిపారు. బ్లాక్ ఫంగస్ చికిత్స కోసం కోఠి ఈఎన్టీ ఆసుపత్రినీ నోడల్ ఆసుపత్రిగా చేశామని వివరించారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా కరోనా చికిత్సకు 40 వేల పడకల అందుబాటులో ఉన్నాయని చెప్పారు . ప్రభుత్వ ఆసుపత్రుల్లో అన్ని బెడ్లను ఆక్సిజన్ బెడ్లుగా మార్చే ప్రయత్నం జరుగుతోందని హై కోర్టు దృష్టికి తెచ్చారు.

Tags

Next Story