
తెలంగాణలో హోలీ సంబరాలు ఉత్సాహంగా జరుగుతున్నాయి. హైదరాబాద్ సహా పలు జిల్లాల్లో ఏర్పాటు చేసిన ఈవెంట్స్‌లో యువతీ, యువకులు రంగులు పూసుకుని సంతోషంగా గడిపారు. కేరింతలు కొడుతూ డ్యాన్స్‌లు చేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ముందస్తూ హోలీ వేడుకలు సందడిగా సాగాయి.
హైదరాబాద్‌లో ప్రత్యేక ఈవెంట్స్‌లు నిర్వహించారు. విద్యార్థులు, స్నేహితులంతా ఒక చోట చేరి సంబరాలు జరుపుకున్నారు. హైదరాబాద్ మోడల్స్ ఆధ్వర్యంలో కూకట్‌పల్లి వై జంక్షన్‌లోని H.M.D.A ప్లే గ్రౌండ్‌లో.... 'కంట్రీ క్లబ్ హోలీ' పేరుతో వేడుకలు నిర్వహించారు. సేంద్రీయ రంగులతో ఐదు గంటల పాటు సాగిన 'కంట్రీ క్లబ్ హోలీ' సంబరాల్లో యువత పెద్ద సంఖ్యల్లో పాల్గొని జోష్‌గా రెయిన్ డాన్స్‌లు చేశారు. మ్యూజిక్ మస్తీలో ఉర్రూతలూగారు. ఆత్మీయులంతా ఒకరికొకరు రంగులు పూసుకొని హోలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.
పలు జిల్లాల్లో యువతీ, యువకులు రంగులు చల్లుకుంటూ హోలీ పండుగ జరుపుకున్నారు. తొలిసారి ఖమ్మంలో ఏర్పాటు చేసిన హోలీ వేడుకల్లో యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేకంగా పాండిచ్చేరి నుంచి తెప్పించిన DJ , సంగీత శబ్ధాలకు యువత డ్యాన్స్ చేస్తూ ఉత్సాహంగా గడిపారు.
హైదరాబాద్ నాంపల్లి పబ్లిక్ గార్డెన్‌లో గార్డెన్ గ్యాలరీ ఆధ్వర్యంలో నిర్వహించిన వేడుకల్లో బీజేపీ పా హైదరాబాద్ పార్లమెంట్ అభ్యర్థి మాధవిలత పాల్గొన్నారు. ఈ వేడుకల్లో రాజస్థానీ, మార్వాడీ కుటుంబాలు పాల్గొని ఉత్సాహంగా, సందడిగా ఒకరికొకరు రంగులు పూసుకోని నృత్యాలు చేస్తూ... హొలీ శుభాకాంక్షలు తెలుపుకున్నారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com