నేడు తెలంగాణకు రానున్న అమిత్‌షా

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ షెడ్యూల్ ఖరారైంది. ఇవాళ రాత్రి 11గంటల 55నిమిషాలకు శంషాబాద్ ఎయిర్ పోర్టుకు అమిత్ షా చేరుకోనున్నారు. రాత్రికి శంషాబాద్‌లోని నోవాటెల్‌లోనే బస చేస్తారు. రేపు ఉదయం 11గంటల 45నిమిషాలకు డైరెక్టర్ రాజమౌళిని మణికొండ లోని నివాసంలో కలవనున్నారు. అరగంట పాటు రాజమౌళితో పలు అంశాలపై మాట్లాడుతారు. అనంతరం మధ్యాహ్నం 12గంటల 45నిమిషాలకు శంషాబాద్ జేడీ కన్షెన్షన్‌కు వెళ్లనున్నారు.
అక్కడ గంటపాటు కార్యకర్తల లంచ్ మీటింగ్‌లో పాల్గొంటారు. 2గంటల 25నిమిషాలకు హెలి కాప్టర్‌లో భద్రాచలం బయల్దేరుతారు. 3గంటల 45నిమిషాలకు భద్రాచలం చేరుకోనున్న అమిత్ షా,.. సాయంత్రం 4గంటలకు సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకుంటారు. సాయంత్రం 5గంటల 30నిమిషాలకు ఖమ్మం చేరుకుంటారు. ఎన్టీఆర్ శత జయంతి ఉత్సవాల సందర్భంగా 5గంటల 40నిమిషాలకు ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పిస్తారు. సాయంత్రం ఆరు గంటలకు బహిరంగ సభలో ప్రసంగిస్తారు. రాత్రి 7గంటల 10నిమిషాలకి ఖమ్మం గెస్ట్‌హౌస్‌కు చేరుకుంటారు. 7గంటల 40నిమిషాలకు రోడ్డుమార్గంలో గన్నవర్గం వెళ్తారు. రాత్రి 8గంటల 15నిమిషాలకు గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి ప్రత్యేక విమానంలో గుజరాత్ వెళ్తారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com