AMIT SHAH: రెండు లక్షలు ఉద్యోగాలిస్తాం

AMIT SHAH:  రెండు లక్షలు ఉద్యోగాలిస్తాం
బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయమిదే... వాల్మీకీలకు న్యాయం చేస్తాం.......తెలంగాణ పర్యటనలో అమిత్‌ షా హామీల జల్లు

తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వాల్మీకీలకు న్యాయం చేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా హామీనిచ్చారు. సీఎం కేసీఆర్‌ చెప్పినట్టు వాల్మీకి బోయల రిజర్వేషన్లపై ఎలాంటి సిఫార్సులు కేంద్రానికి అందలేదని అమిత్‌షా స్పష్టం చేశారు. ఎన్నికల సమయం దగ్గర పడుతున్నా కొద్దీ భారతీయ జనతా పార్టీ ఎన్నికల ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఇప్పటికే ప్రధాని నరేంద్రమోదీ పలు దఫాలుగా తెలంగాణకు వచ్చి ఎన్నికల ప్రచారాన్ని ఉద్ధృతంగా చేయగా తాజాగా కేంద్రహోంశాఖ మంత్రి అమిత్‌షా.. సకల జనుల విజయ సంకల్ప సభ పేరుతో గద్వాల, నల్గొండ, వరంగల్‌ సభల్లో పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ చెప్పినట్టు వాల్మీకి బోయల రిజర్వేషన్లకు సంబంధించిన ఎలాంటి సిఫార్సులు కేంద్రానికి అందలేదని అమిత్‌షా స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే వారికి న్యాయం చేస్తామని హామి ఇచ్చారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో బీజేపీ నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో అమిత్‌ షా పాల్గొన్నారు. బీఆర్‌ఎస్‌కు వీఆర్‌ఎస్‌ ఇచ్చే సమయం ఆసన్నమైందన్న అమిత్‌ షా కేసీఆర్‌ అబద్ధాలు మాట్లాడటంలో రికార్డులు సృష్టించారన్నారు. జోగులాంబ ఆలయ అభివృద్దికి కేసీఆర్‌ ఇస్తానన్న 100 కోట్లు ఇవ్వకపోగా.. మోదీ ఇచ్చిన 70 కోట్ల నిధులు కూడా ఖర్చు చేయలేదన్నారు. తెలంగాణలో బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపిస్తే ఆయోధ్యలో రాముడి దర్శనం ఉచితంగా చేపిస్తుందని అమిత్‌షా అన్నారు. బీసీలకు బడ్జెట్‌లో 3వేల 3వందల కోట్లు కేటాయించిన కేసీఆర్‌.. ఖర్చు చేసింది మాత్రం 77 కోట్లు మాత్రమే అంటూ తప్పుబట్టారు.


కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ రెండు కూడా కుటుంబ పార్టీలే అని తమ వారసులను పదవుల్లో కూర్చోబెట్టడమే కుటుంబ పార్టీల లక్ష్యమని అమిత్‌ షా ఆరోపించారు. నల్గొండలో నిర్వహించిన సకల జనుల విజయ సంకల్ప సభలో పాల్గొన్నారు. స్మార్ట్‌ సిటీ కింద నల్గొండ అభివృద్ధికి మోదీ సర్కార్‌ 400 కోట్లు ఇచ్చిందనిఆ నిధులను కేసీఆర్‌ దుర్వినియోగం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీకి మీరు వేసే ఓటు తెలంగాణ.. దేశ భవిష్యత్‌ను మారుస్తుందన్నారు.

ముస్లింల సంతుష్టీ కరణ పేరుతో బీఆర్‌ఎస్‌ సర్కారు 4 శాతం రిజర్వేషన్లు తీసుకువచ్చిందని.. బీజేపీ అధికారంలోకి వస్తే... వాటిని రద్దు చేస్తామని... అమిత్‌ షా పేర్కొన్నారు. బీజేపీ పాలనలో నిరుద్యోగులకు పారదర్శకంగా పరీక్షలు నిర్వహించి.. ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని అమిత్‌ షా వెల్లడించారు. బీసీలకు బడ్జెట్‌లో 3వేల 300 కోట్లు కేటాయించిన కేసీఆర్‌ 77 కోట్లు మాత్రమే ఖర్చు చేశారని ఆరోపించారు. కేసీఆర్‌ అడుగడుగునా బీసీలకు అన్యాయమే చేస్తున్నారని ఆక్షేపించారు.

Tags

Read MoreRead Less
Next Story