Yadadri Bhuvanagiri : యాదాద్రి భవనగిరి జిల్లాలో పరువు హత్య..!

Yadadri Bhuvanagiri : యాదాద్రి భవనగిరి జిల్లాలో పరువు హత్య..!
X
Yadadri Bhuvanagiri : యాదాద్రి భవనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది.. రెండ్రోజులుగా కనిపించకుండా పోయిన మాజీ హోంగార్డ్‌ రామకృష్ణ హత్యకు గురయ్యాడు..

Yadadri Bhuvanagiri : యాదాద్రి భవనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో పరువు హత్య తీవ్ర కలకలం రేపుతోంది.. రెండ్రోజులుగా కనిపించకుండా పోయిన మాజీ హోంగార్డ్‌ రామకృష్ణ హత్యకు గురయ్యాడు.. అయితే, ఈ హత్య చేయించింది మామే కావడం సంచలనంగా మారింది.. వీఆర్‌వోగా పనిచేస్తున్న వెంకటేష్‌ కూతురు భార్గవి.. హోంగార్డ్‌ రామకృష్ణ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు.

అయితే, తన కూతురు కులాంతర వివాహం చేసుకుందని కక్ష పెంచుకున్న వెంకటేష్‌.. అల్లుణ్ని హత్య చేయించేందుకు ప్లాన్‌ వేశాడు.. లతీఫ్‌ అనే రౌడీషీటర్‌ను హత్యకు పురమాయించాడు.. సుపారీ ఇచ్చి మరీ అల్లుణ్ని హత్య చేయించాడు.. భువనగిరి డివిజన్‌ గుండాలలో రామకృష్ణను హత్య చేయించిన లతీఫ్‌ గ్యాంగ్‌.. మృతదేహాన్ని మెదక్‌ జిల్లాలో పడేశారు.. ప్రస్తుతం లతీఫ్‌ గ్యాంగ్‌ రాచకొండ ఎస్‌వోటీ పోలీసుల అదుపులో ఉంది.

నిందితులు ఇచ్చిన సమాచారం ఆధారంగా రామకృష్ణ మృతదేహం కోసం ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలిస్తున్నారు పోలీసులు. తుర్కపల్లి గుప్తునిధుల తవ్వకాల కేసులో హోంగార్డు రామకృష్ణ ప్రధాన నిందితుడుగా ఉన్నాడు. ఈ కేసులోనే రామకృష్ణను అధికారులు సస్పెండ్‌ చేశారు.. అయితే, ఆ తర్వాత రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేసుకుంటున్నాడు.. రామకృష్ణ సొంతూరు వలిగొండ మండలం ప్రొద్దుటూరు లింగరాశి పల్లి.. రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం పేరు చెప్పి తన భర్తను ఓ వ్యక్తి తీసుకెళ్లాడని ఆయన భార్య భార్గవి చెప్తోంది..

Tags

Next Story