ఫీజులు చెల్లించలేదని కరోనా పేషెంట్‌ను బంధించిన హాస్పిటల్ యాజమాన్యం..!

ఫీజులు చెల్లించలేదని కరోనా పేషెంట్‌ను బంధించిన హాస్పిటల్ యాజమాన్యం..!
నాలుగు లక్షలు కడితే డిశ్చార్జీ చేస్తామని విన్ ఆస్పత్రి యాజమాన్యం చెబుతోందని కోవిడ్ పేషెంట్ రామారావు ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసాడు.

హైదరాబాద్ బేగంపేట్‌లోని విన్ హాస్పిటల్ యాజమాన్యం డబ్బుల కోసం కరోనా రోగిని బంధించిన వైనం వెలుగుచూసింది. నాలుగు లక్షలు కడితే డిశ్చార్జీ చేస్తామని విన్ ఆస్పత్రి యాజమాన్యం చెబుతోందని కోవిడ్ పేషెంట్ రామారావు ఆరోపిస్తూ సెల్ఫీ వీడియో తీసాడు. కరోనా పాజిటివ్‌తో ఈనెల 1న బేగంపేట్ విన్ ఆస్పత్రిలో చేరాడు. అయితే తనకు హెల్త్ ఇన్సూరెన్స్ ఉండటంతో చికిత్సకు అయ్యే ఖర్చు మొత్తం తామే క్లయిమ్ చేసుకుంటామని వైద్యులు చెప్పారని రామారావు అంటున్నాడు. కోవిడ్ కోసం అడ్మిట్ అయితే అనవసరమైన టెస్టుల చేసి నాలుగు లక్షల రూపాయలు బిల్లు చేసారని ఆరోపించాడు. కనీసం గుండె జబ్బు ఉందని ప్రాధేయ పడినా యాజమాన్యం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మరోవైపు తమకు న్యాయం చేయాలంటూ కోవిడ్ పేషెంట్ రామారావు బంధువులు.. మంత్రి కేటీఆర్, ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌కు ఫిర్యాదు చేసారు.

Tags

Read MoreRead Less
Next Story