TG: హాస్టళ్లలో డైట్‌, కాస్మొటిక్‌ ఛార్జీలు పెంపు

TG:  హాస్టళ్లలో డైట్‌, కాస్మొటిక్‌ ఛార్జీలు పెంపు
X
సంక్షేమ హాస్టళ్ల విద్యార్థులకు రేవంత్ సర్కార్ గుడ్ న్యూస్ ... విద్యార్థులు, తల్లిదండ్రుల హర్షం

తెలంగాణలోని సంక్షేమ హాస్టళ్లలో ఉంటున్న విద్యార్థులకు సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. హాస్టళ్లలో డైట్‌, కాస్మొటిక్‌ ఛార్జీలను పెంచింది. అన్ని గురుకులాలు, కొన్ని శాఖలకు చెందిన అనుబంధ హాస్టళ్లకు ఛార్జీల పెంపు వర్తిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. హాస్టళ్లలో డైట్‌, కాస్మొటిక్ ఛార్జీలు పెంచుతూ ప్రభుత్వం జీవో జారీ చేసింది. పాత, కొత్త ఛార్జీల వివరాలు: 3వ తరగతి నుంచి 7వ తరగతి వరకు హాస్టళ్లలో ఉండే విద్యార్థులకు ఇప్పటివరకూ డైట్ ఛార్జీలు రూ.950గా ఉండగా.. ఇకపై అవి రూ.1,330గా ఉంటాయి. దీని వల్ల విద్యార్థులకు నాణ్యమైన డైట్ లభిస్తుందని ప్రభుత్వం వెల్లడించింది. ఎనిమిదో తరగతి నుంచి 10వ తరగతి వారికి ఇప్పటివరకూ.. రూ.1,100 ఉండగా.. ఇకపై అది రూ.1,540గా ఉంటుంది. విద్యార్థులకు మంచి ఆహారం లభించి.. పోషకాలు బాగా అంది.. బ్రెయిన్ బాగా పనిచేసి, చక్కగా చదువుకోగలరని తెలిపింది.

ఇంటర్ విద్యార్థులకు కూడా..

ఇంటర్‌ నుంచి పీజీ వరకు విద్యార్థులకు ఇప్పటివరకూ రూ.1,500 ఉండగా.. ఈ డైట్ ఛార్జీలను రూ.2,100కి పెంచారు. రాష్ట్రవ్యాప్తంగా 7,65,700 మంది హాస్టల్‌ విద్యార్థులు ఉన్నారు. 3 నుంచి 7వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికీ రూ.55గా ఉన్న కాస్మోటిక్‌ ఛార్జీలను రూ.175కి పెంచారు. 8 నుంచి 10వ తరగతి వరకు రూ.75 నుంచి రూ.275కి పెంచారు.


Tags

Next Story