Hot Summer : ఈ సమ్మర్ చాలా హాట్ గురూ..!

Hot Summer : ఈ సమ్మర్ చాలా హాట్ గురూ..!
ఈ వేసవిలో సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 0.5 నుంచి 1.5 డిగ్రీ సెల్సియస్ వరకూ ఎక్కువ వేడి అండే ఛాన్స్‌ ఉందని ఐఎమ్‌డి (India Meteorological Department) తెలిపింది.


సమ్మర్ అంటే చాలు.. జనాలకు ఒళ్లంతా చెమట్లు పట్టేస్తున్నాయ్. నిప్పులు కురిపించే వేసవిని తలుచుకుని వణికిపోతున్నారు. ఈసారి ఎండలు ఎలా ఉంటాయో అని ఆందోళన చెందుతున్నారు. ఈ క్రమంలో భారత వాతావరణ విభాగం జనాలకు చెమట్లు పట్టించే వార్త చెప్పింది. ఈ సమ్మర్ చాలా హాట్ గురూ అని ఐఎండీ తేల్చింది.ఈ సమ్మర్ చాలా హాట్ గా ఉండొచ్చని, అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డ్ అయ్యే చాన్స్ ఉందని ఐఎండీ వేసిన అంచనా జనాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.మాడు పగిలిపోయే ఎండలు ఈసారి కూడా తప్పవేమో అని వర్రీ అవుతున్నారు.అప్పుడే ఎండలు మండిపోతున్నాయి. గత రెండు మూడు రోజులుగా ఒక్కసారిగా ఎండ తీవ్రత పెరిగింది. ఉష్ణోగ్రతలు పెరిగాయ్. సూర్యుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఎండవేడికి జనాలు విలవిలలాడుతున్నారు. స్టార్టింగ్ లోనే ఈ రేంజ్ లో సూర్యుడు మండిపోతున్నాడంటే, ముందు ముందు మంటలు పుట్టిస్తాడని ఆందోళన చెందుతున్నారు.

మరోవైపు వాతావరణ ప్రభావం వల్ల ప్రతి ఏటా ఎండ తీవ్రత పెరుగుతూనే ఉంది. గతంతో పోల్చితే ఈ ఏడాది ఎండలు మరింత ఎక్కువ కానున్నాయట. ఈ వేసవికాలంలో సాధారణ ఉష్ణోగ్రతలతో పోలిస్తే 0.5 నుంచి 1.5 డిగ్రీ సెల్సియస్ వరకూ ఎక్కువ వేడి అండే ఛాన్స్‌ ఉందని

ఐఎమ్‌డి (India Meteorological Department) తెలిపింది.. ఆంధ్రప్రదేశ్‌, గోవా, మహారాష్ట్ర, గుజరాత్‌, ఒడిశా తీర ప్రాంతాల్లో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఉత్తర భారతంలో రాత్రి పూట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే అధికంగానే ఉండొచ్చంది.

అయితే దీనికి వాతావరణంలో వస్తున్న మార్పే కారణమని అధికారులు అంటున్నారు. ఎప్పుడైనా ఏప్రిల్, మే నెలల్లో ఎండల ప్రభావం ఉండేది. కానీ ఈసారి మార్చి రెండో వారం నుంచి ఎండ మంట పెరగడం ప్రారంభం అవుతుందని అంటున్నారు. దీనికి తోడు మే నెలలో వడగాడ్పులు వీస్తాయని హెచ్చరించారు. గరిష్ఠ ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలను దాటే అవకాశం ఉందట. దీంతో ఎండా కాలం ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Tags

Read MoreRead Less
Next Story