తెలంగాణలో బాణసంచా నిషేధంపై సుప్రీంకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్

తెలంగాణలో బాణసంచాపై నిషేధంతో వ్యాపారులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. బాణసంచాపై నిషేధం విధిస్తూ.. హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ.. తెలంగాణ ఫైర్ వర్క్స్ డీలర్స్ అసోసియేషన్ సుప్రీం కోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. వీరి తరపున అడ్వకేట్ జయకృష్ణ పిటిషన్ దాఖలు చేశారు. క్రాకర్స్‌ను బ్యాన్ చేస్తూ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై స్టే ఇవ్వాలని అసోసియేషన్ పిటిషన్‌లో కోరింది. దీపావళికి రెండ్రోజుల ముందు బ్యాన్ విధిస్తే కోట్లలో నష్టపోతామని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం విధించిన బ్యాన్‌ను ఎత్తివేయాలని విజ్ఞప్తి చేసింది. హైకోర్టు తీర్పు వల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చిందని పేర్కొంది. అన్ని అనుమతులిచ్చిన ప్రభుత్వం.. ఇప్పుడు బ్యాన్ అంటే తాము ఎక్కడికి వెళ్లాలని అసోసియేషన్ ఆందోళన వ్యక్తం చేసింది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com