HSU : కశ్మీరీ ఫైల్స్ vs మోదీ బీబీసీ డాక్యుమెంటరీ

హైదరాబాద్ సెంట్రల్ యునివర్సిటీలో ప్రధాని మోదీపై BBC ( బ్రిటీష్ బ్రాడ్ కాస్టింగ్ కంపెనీ ) రూపొందించిన డాక్యుమెంటరీని స్టుడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (SFI) ప్రదర్శించింది. ఇందుకు నిరసనగా, అదే క్యాంపస్ లో 'ది కశ్మీరీ ఫైల్స్' ను ప్రదర్శించింది ABVP ( అఖిల భారత విద్యార్థి పరిషత్ ). గణతంత్ర దినోత్సవం సందర్భంగా వర్సిటీలో రెండు స్క్రీన్స్ ప్రదర్శితమయ్యాయి.
ప్రధాని మోడీపై చిత్రించిన డాక్యుమెంటరీని చూడడానికి 400మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు SFI విద్యార్థి సంఘం నాయకులు. భావ ప్రకటనా స్వేచ్చ, క్యాంపస్ ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టిన వారికి SFI-HSU సెల్యూట్ చేస్తుందని అన్నారు. ABVP అశాంతిని సృష్టించడానికి ప్రయత్నిస్తుందని సోషల్ మీడియాలో తెలిపారు. ఈ ఘటనను ప్రతిఘటించిన ABVP-HSU విద్యార్థి నాయకులు అదేరోజు కశ్మీరీ ఫైల్స్ ను ప్రదర్శించారు. స్క్రీనింగ్ సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగలేదని క్యాంపస్ వర్గాలు తెలిపాయి.
2002 గుజరాత్ అల్లర్లకు సంబంధించిన డాక్యుమెంటరీని బీబీసీ రూపొందించింది. ప్రధాని మోడీ అల్లర్ల సమయంలో గుజరాత్ సీఎంగా ఉన్నారు. అల్లర్లను కంట్రోల్ చేయడంలో మోదీ విఫలం అయ్యారనే విమర్శ ఉంది. అదే విషయాన్ని ప్రస్తావిస్తూ బీబీసీ డాక్యుమెంటరీని తీసినట్లుగా తెలుస్తోంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com