KCR Birthday : కేసీఆర్ జన్మదిన వేడుకలకు భారీగా ఏర్పాట్లు

ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలకు భారీ ఏర్పాట్లు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్దయెత్తున ఏర్పాట్లు చేస్తున్నారు. దీనిలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా పలు చోట్ల క్రికెట్ పోటీలు, కోటి వృక్షార్చన కార్యక్రమాలకు సిద్దమయ్యారు.
కేసీఆర్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులు తయారుచేసిన రెండున్నర కిలోల బంగారు చీరను ఎమ్మెల్సీ కవిత బల్కంపేట అమ్మవారికి సమర్పించనున్నారు. ఇందుకోసం ప్రధాన ఆలయంలో గులాబీ శ్రేణులు భారీగా ఏర్పాట్లు చేశారు.
మరోవైపు కేసీఆర్ జీవిత చరిత్రను తెలియజేసేలా డాక్యుమెంటరీని తీశారు. కేసీఆర్ బాల్యం, విద్యాభ్యా సం, రాజకీయ అరంగేట్రం, ఉద్యమ నేపథ్యం వంటి అరుదైన ఫోటోలతో డాక్యుమెంటరీ రూపొందించారు. సీఎంగా బాధ్యతలు చేపట్టడం.. దేశంలో పేరుగాంచిన పథకాలు తెలిపేలా దీన్ని రూపొందించారు.
వీటితోపాటు అన్నదాన కార్యక్రమాలు,కేక్ కట్ చేసేందుకు పార్టీ శ్రేణులు సమాయాత్తమయ్యారు. అయితే ప్రతిసారి పార్టీ నేతలు ప్రగతి భవన్‌లో సీఎంను కలిసి బర్త్‌డే విషెస్ చెపుతారు. కరోనా కారణంగా ఈసారి కలిసే అవకాశం ఇస్తారో లేదా అని నేతలు, పార్టీశ్రేణులు ఎదురుచూస్తున్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com