DRUGS: న్యూ ఇయర్ వేళ.. భారీగా డ్రగ్స్ స్వాధీనం

DRUGS:  న్యూ ఇయర్ వేళ.. భారీగా డ్రగ్స్ స్వాధీనం
X
హైదరాబాద్‌ శివారులో భారీగా డ్రగ్స్ స్వాధీనం చేసుకున్న పోలీసులు

కొత్త సంవత్సరం వేళ భారీగా డ్రగ్స్, మత్తు పదారాలు నగరంలోకి వస్తాయని పోలీసుల ఆకస్మితక తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో హైదరాబాద్ శివారులో భారీగా మత్తుమందు స్వాధీనం చేసుకున్నారు. న్యూ ఇయర్ వేడుకల కోసం హైదరాబాద్‌కు తరలిస్తున్న 2 కేజీల పప్పిస్ట్రా అను మత్తు పదార్థాన్ని స్వాధీనం చేసుకున్నారు. కీసర పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు కేజీల మత్తు పదార్థం పప్పిస్ట్రా స్వాధీనం చేసుకున్నారు.

పబ్‌లో డ్రగ్స్ స్వాధీనం

నూతన సంవత్సరం సంబరాల వేళ హైదరాబాద్‌లో డ్రగ్‌ విచ్చలవిడి వినియోగం కలకలం రేపుతోంది. న్యూ ఇయర్ వేళ పోలీసులు కూడా నిఘా పెంచి విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. పలు ప్రాంతాల్లో డ్రగ్స్ సరఫరా జరుగుతుందని సమాచారం తో టీఎస్ నాబ్ పోలీసులు రెండు మూడు రోజులుగా దాడులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా కొండాపూర్ మస్జీద్ బండలోని క్వాక్ అరేనా పబ్ లో సోదాలు నిర్వహించారు. పోలీసులు తనిఖీల్లో భారీగా డ్రగ్స్ పట్టుబడ్డాయి. పబ్ కు వచ్చిన వారు డ్రగ్స్ తీసుకున్నట్టు తేలింది. దీనికి సంబంధించి ఏడుగురిని నాబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ఈవెంట్ లో డ్రగ్స్ తీసుకున్నారా లేక బయట డ్రగ్స్ తీసుకుని ఈవెంట్ కు వచ్చారా అన్న కోణం లో దర్యాప్తు చేస్తున్నారు. మరోవైపు న్యూ ఇయర్ వేడుకల కోసమని తరలిస్తున్న అక్రమ మద్యం బాటిళ్లను పోలీసులు సీజ్ చేశారు. సంగారెడ్డి జిల్లా మొగుడం పల్లి చెక్ పోస్ట్ వద్ద రూ.1.60 లక్షల విలువైన 64మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు.

Tags

Next Story