ప్రియుడితో కలిసి జల్సా చేస్తున్న భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్న భర్త

గృహ హింస కేసులతో తనను వేధింపులకు గురిచేస్తూ ప్రియుడితో కలిసి జల్సా చేస్తున్న భార్యను రెడ్‌హ్యాండెడ్‌గా పోలీసులకు పట్టించాడో భర్త. హైదరాబాద్ రామాంతపూర్‌లోని ఇంద్రనగర్‌లో జరిగిందీ ఘటన. భార్య, ఆమె ప్రియుడు తీరుతో కొన్నాళ్లుగా తాను తీవ్రమైన మానసిక క్షోభకు గురయ్యాయనని భర్త అంటున్నాడు. వీరిద్దరి అక్రమ సంబంధం బయటపెట్టాలనే ఉద్దేశంతోనే ఇలా డైరెక్ట్‌గా పోలీసులకు పట్టించానని వివరించాడు. సమాజంలో గౌరవంగా బతుకుతున్న తనను వీరిద్దరూ టార్చర్ చేశారని, 498(A) కేసు పెట్టి ఇబ్బంది పెట్టారని ఆవేదన వ్యక్తం చేశాడు. గాంధీ ఆస్పత్రి జనరల్ మెడిసిన్‌లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న తన భార్యతో.. జయరామ్ స్నేహం మొదలయ్యాకే గొడవలు మొదలయ్యాయంటున్నారు. వాళ్లిద్దరి గుట్టు రట్టయిన నేపథ్యంలో ఈ కేసుల నుంచి తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. నిన్న రాత్రి భర్య ఫిర్యాదుతో ఇద్దరినీరెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న పోలీసులు స్టేషన్‌కి తరలించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com