Husnabad: క్రికెట్ ఆడుతూ.. గుండెపోటుకు గురై..

X
By - Prasanna |7 April 2023 1:49 PM IST
Husnabad: చిన్న వయసులోనే గుండెపోటుకు గురై మృత్యువాత పడుతున్న యువకుల సంఖ్య ఈ మధ్య మరీ ఎక్కువైంది.
Husnabad: చిన్న వయసులోనే గుండెపోటుకు గురై మృత్యువాత పడుతున్న యువకుల సంఖ్య ఈ మధ్య మరీ ఎక్కువైంది.తెలంగాణ సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్‌కు చెందిన 37 ఏళ్ల ఆంజనేయులు క్రికెట్ ఆడుతున్నారు. పట్టణంలో జరుగుతున్న క్రికెట్ టోర్నమెంట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ క్రమంలో బౌలింగ్ చేస్తుండగా ఆంజనేయులుకు ఛాతిలో నొప్పిగా అనిపించింది. తోటి ఆటగాళ్లతో చెబుతూనే ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. వెంటనే సహచరులు సీపీఆర్ చేసినప్పటికీ ప్రాణాలు కాపడలేకపోయారు. అప్పటికే ఆంజనేయులు ఊపిరి ఆగిపోయింది. మృతుడి స్వస్థలం చిగరుమామిడి మండలం సుందరగిరి. ఈ ఘటనతో హుస్నాబాద్‌లో విషాదం నెలకొంది.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com