Huzurabad by Election: అబద్ధం ముందు పుట్టి కేసీఆర్ తర్వాత పుట్టారు: కేంద్రమంత్రి కిషన్ రెడ్డి

Huzurabad by Election: హుజురాబాద్ బైపోల్ ప్రచారం హైఓల్టేజ్‌తో సాగుతోంది. టీఆర్‌ఎస్ తరపున మంత్రి హరీష్ తమ పార్టీ అభ్యర్ది గెలుపు బాధ్యతను తన భుజాలపై వేసుకుని ప్రచారం చేస్తున్నారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో సీఎం కేసీఆర్ రోడ్ షో ఉండే అవకాశాలున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అక్టోబరు 26, 27న హుజురాబాద్‌లో రోడ్ షోలు నిర్వహిస్తే బాగుంటుందని నేతలు సీఎం కేసీఆర్‌ను కోరారు.
నేతల విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన సీఎం కేసీఆర్.. రోడ్‌షోలకు సంబంధించిన షెడ్యూల్, రోడ్ మ్యాప్‌ను రూపొందించి పంపాలని స్థానిక మంత్రులు, నేతలకు కేసీఆర్ సూచించినట్లు తెలుస్తోంది. హరీష్‌రావు, కొప్పుల ఈశ్వర్, వినోద్‌కుమార్ సహా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, నియోజకవర్గ నేతలు రోడ్ మ్యాప్ షెడ్యూల్ రెడీ చేస్తున్నారు.
హుజురాబాద్ పోరులో మాటల తూటాలు పేలుతున్నాయి. ఈటల, హరీష్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. ఈటలకు బీజేపీ వాసన బాగా పట్టిందని విమర్శించారు. బీజేపీ అంటే జూటేబాజ్, బట్టేబాజ్ పార్టీ అని హరీష్‌రావు హాట్ కామెంట్స్ చేశారు. పోలింగ్‌కు సమయం దగ్గర పడుతుండడంతో బీజేపీ కూడా దూకుడు పెంచింది.
సీఎం కేసీఆర్‌పై కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. అబద్ధం ముందు పుట్టి కేసీఆర్ తర్వాత పుట్టారు అంటూ విమర్శించారు. ఈటలను ఓడించడానికి కేసీఆర్ వందల కోట్లు ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకోవాల్సిన అవసరం బీజేపీకి లేదని, బీజేపీకి ప్రధాన ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీనే అని తేల్చి చెప్పారు కిషన్ రెడ్డి. కాంగ్రెస్ పార్టీతో లోపాయికారి ఒప్పందం చేసుకుందన్న టీఆర్‌ఎస్ వ్యాఖ్యలను కిషన్ రెడ్డి తిప్పికొట్టారు.
ఇక బీజేపీ అగ్ర నాయకులు హుజురాబాద్‌లోనే మకాం వేసి ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ తెలంగాణ చీఫ్ బండి సంజయ్, విజయ శాంతి నియోజకవర్గ పరిధిలో జోరుగా ప్రచారం చేస్తున్నారు. ఇదే సమయంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సైతం హుజారాబాద్ పర్యటనకు సిద్దమయ్యారు. వీణవంక బస్టాండ్ ప్రాంగణంలో సమావేశం నిర్వహించనున్నారు.
వీణవంక నుంచి జమ్మికుంటలో ప్రచారం చేస్తారు. రేపు మధ్యాహ్నం 3గంటలకు ఇల్లందకుంటలో ప్రచారం తరువాత కమలాపూర్ బస్టాండ్ సమీపంలో ఎన్నికల ప్రచారం చేయనున్నారు. రేవంత్ బాధ్యతలు స్వీకరించిన తరువాత వస్తున్న తొలి ఎన్నిక కావటంతో రేవంత్ గట్టిగానే మాట్లాడతారన్న ప్రచారం జరుగుతోంది. హుజురాబాద్‌లో మహిళా ఓటర్లే కీలకం కావడంతో అన్ని పార్టీలు వారిని ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేస్తున్నాయి. గృహిణులను టార్గెట్ చేసేలా గ్యాస్ సిలిండర్‌ను తన ప్రచారంలో విరివిగా వాడుతోంది టీఆర్‌ఎస్. అటు బీజేపీ తరపున ఈటల రాజేందర్ సతీమణి జమున జోరుగా ప్రచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com