Election commission : హుజురాబాద్ ఉపఎన్నిక వాయిదా..!

హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలు వాయిదా వేసింది ఎలక్షన్ కమిషన్. కరోనా కారణంగా ఉప ఎన్నికలు వాయిదా వేస్తున్నట్టు సీఈసీ ప్రకటించింది. బెంగాల్, ఒడిశాలోని నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాల్లో మినహా.. దేశవ్యాప్తంగా జరగాల్సిన 31 అసెంబ్లీ స్థానాలు, 9 పార్లమెంటరీ నియోజకవర్గాల్లోనూ ఎన్నికలు వాయిదా వేసింది ఎలక్షన్ కమిషన్.
ఏపీ, తెలంగాణలో కరోనా, వరదలు, వరుస పండగల కారణంగా ఇప్పుడప్పుడే ఎన్నికలు వద్దని తెలుగు రాష్ట్రాలు ఎలక్షన్ కమిషన్‌ను కోరాయి. పండగల సీజన్ అయిపోయిన తర్వాత ఉప ఎన్నికలు పెట్టాలని సూచించాయి. దీంతో తెలుగు రాష్ట్రాల్లో జరగాల్సిన హుజురాబాద్, బద్వేల్ ఉప ఎన్నికలను వాయిదా వేసి.. బెంగాల్, ఒడిశాలోని నాలుగు అసెంబ్లీల ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసింది ఈసీ. దసరా పండగ తరువాతే హుజురాబాద్, బద్వేల్ ఉపఎన్నికల నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం కనిపిస్తోంది.
పశ్చిమ బెంగాల్‌లో 3 అసెంబ్లీలు, ఒడిశాలో ఒక అసెంబ్లీకి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. సెప్టెంబర్ 30న పోలింగ్, అక్టోబర్ 3న కౌంటింగ్ ఉంటుందని ఈసీ తెలిపింది. సెప్టెంబర్ 6న ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుంది.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com