Huzurabad: హుజూరాబాద్ ఉప ఎన్నికల్లో భారీ ఆధిక్యం దిశగా ఈటల..

Huzurabad: హుజురాబాద్ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ దూసుకెళ్తున్నారు. పద్నాలుగో రౌండ్‌లో టీఆర్ఎస్‌పై బీజేపీ వెయ్యి 46 ఓట్ల ఆధిక్యం సాధించింది. ఈ రౌండ్ ముగిసేసరికి ఈటల 9 వేల 452 మెజార్టీలో కొనసాగుతున్నారు. ఇప్పటివరకు బీజేపీ 63 వేల 79 ఓట్లు సాధించగా.. టీఆర్ఎస్ 53 వేల 627 ఓట్లు సాధించింది. కాంగ్రెస్ పార్టీ పూర్తిగా చతికిల పడింది.
అంతకుముందు పదమూడు, పన్నెండ్ రౌండ్లలోనూ ఈటల సత్తా చాటారు. పదమూడో రౌండ్‌లో 18 వందల 65 ఓట్ల ఆధిక్యం సాధించిన ఈటల.. పన్నెండో రౌండ్‌లో 12 వందల 17 ఓట్ల మెజార్టీ సాధించారు. అయితే పదకొండో రౌండ్‌లో టీఆర్ఎస్ ఆధిక్యంలోకి వచ్చింది. పదకొండో రౌండ్‌లో టీఆర్ఎస్ 385 ఓట్ల ఆధిక్యంలోకి వచ్చింది.
ఉదయం పోస్టల్ బ్యాలెట్‌లో టీఆర్ఎస్ అధిక్యం కనబర్చగా.. ఆ తర్వాత ప్రతి రౌండ్‌లోనూ ఈటల రాజేందర్ ఆధిక్యం పెంచుకుంటూ వెళ్లారు. వరుసగా ఏడు రౌండ్లలో బీజేపీ పూర్తి ఆధిక్యంతో సత్తా చాటింది. అయితే తర్వాత ఎనిమిదో రౌండ్‌లో మాత్రం టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యంలోకి వచ్చింది. తర్వాత తొమ్మిదో రౌండ్‌లో భారీ మెజార్టీ సాధించిన ఈటల.. పదో రౌండ్‌లోనూ ఆధిక్యంలో దూసుకెళ్లారు.
హుజురాబాద్‌లో బీజేపీ ఆధిక్యంపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆరా తీశారు. రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు బండి సంజయ్‌కు ఫోన్ చేసిన అమిత్ షా.. ప్రత్యేక అభినందనలు తెలిపారు.
ఇక హుజురాబాద్‌లో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. టీఆర్ఎస్ అభ్యర్ధి గెల్లు శ్రీనివాస్ స్వగ్రామం హమ్మత్‌నగర్‌లో బీజేపీ ఆధిక్యం సాధించింది. అలాగే దళితబంధు పైలట్ ప్రాజెక్టు గ్రామం శాలపల్లి, కెప్టెన్ లక్ష్మీకాంతారావు సొంతూరు సింగాపూర్‌లోనూ ఈటలకే ఎక్కువ ఓట్లు పోలయ్యాయి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com