Hybrid Solar Eclipse: నగరంలో హైబ్రిడ్ సూర్యగ్రహణం !

Hybrid Solar Eclipse: నగరంలో హైబ్రిడ్ సూర్యగ్రహణం !
X
ఏప్రిల్ 20 సంభవించనున్న హైబ్రిడ్ సూర్యగ్రహణం; ఆ తరువాత మళ్లీ 2031లోనే....

దశాబ్దానికి ఒక్కసారి సంభవించే అరుదైన హైబ్రిడ్ సూర్యగ్రహణానికి సమయం ఆసన్నమైంది. ఏప్రిల్ 20న ఈ సూర్యగ్రహణం సంభవిస్తుందని నాసా వెల్లడించింది. ఆగ్నేయ ఆసియా, ఈస్ట్ ఇండీస్, ఆస్ట్రేలియా, ఫిలిప్పీన్స్, న్యూజిల్యాండ్, ఇండోనేషియా, పౌపా న్యూ గినియా దేశాల్లో ఈ సూర్యగ్రహణం కనిపించే అవకాశం ఉందని తెలిపింది. అయితే భారత్ ఈ జాబితాలో లేపప్పటికీ దేశంలోని కొన్ని ప్రాంతాల్లో గ్రహణం కనిపించే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి ఈ గ్రహణాన్ని వీక్షించే అవకాశం అయితే లేదని స్పష్టమైంది.

హైబ్రిడ్ సూర్యగ్రహణం అంటే ఏంటి?

హైబ్రిడ్ సూర్యగ్రణం ఇతర గ్రహణాలకున్నా విభిన్నమైనది. దశాబ్దానికి ఒక్కసారి సంభవించే ఈ గ్రహణంలో రెండు రకాలుగా చోటు చేసుకునే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల నుంచి చూస్తే సంపూర్ణ సూర్యగ్రణం, మరొకొన్ని ప్రాంతాల్లో పాక్షిక గ్రహణంగా కనిపిస్తుంది. పోయిన సారి 2013లో ఈ హైబ్రిడ్ గ్రహణం సంభవించింది. ఏప్రిల్ లో జరగబోయే తాజా గ్రహణం అనంతరం మళ్లీ నవంబర్ 14, 2031లో ఇది సంభవించే ఆస్కారం ఉంది.

Tags

Next Story