HYD CP: సంచలన వ్యాఖ్యలు చేసి క్షమాపణ కోరిన సీపీ ఆనంద్

పుష్ప2 విషాదం ఘటనపై కమిషనర్ సీవీ ఆనంద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేషనల్ మీడియాను కొనేశారని.. అందుకే అక్కడ వార్తలు అలా ప్రచారం అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నిజంగానే నేషనల్ మీడియాకు డబ్బులు ఇచ్చారా, మీ ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని సీవీ ఆనంద్ పై నెట్టింట ప్రశ్నల వర్షం మొదలైంది. దాంతో దిగొచ్చిన ఐపీఎస్ సీవీ ఆనంద్ తన మాటలు వెనక్కి తీసుకుని.. క్షమాపణలు చెప్పారు.
సీపీ ఏమన్నారంటే...
పుష్ప విషాద ఘటన జరిగిన రోజు ఏం జరిగిందో పోలీసులు కొన్ని వీడియోలు విడుదల చేసి స్పష్టత ఇచ్చారు. ఈ క్రమంలో మీడియా సీవీ ఆనంద్‌ను కొన్ని విషయాలు ప్రశ్నించగా.. నేషనల్ మీడియాను కొనేశారు. అందుకే అక్కడ వార్తలు అలా ప్రచారం అవుతున్నాయని సంచలన వ్యాఖ్యలు చేశారు. అల్లు అర్జున్ నిజంగానే నేషనల్ మీడియాకు డబ్బులు ఇచ్చారా, అందుకు మీతో ఆధారాలు ఏమైనా ఉన్నాయా అని సీవీ ఆనంద్ పై అర్ధరాత్రి నుంచి సోషల్ మీడియాలో ప్రశ్నల వర్షం మొదలైంది. దాంతో దిగొచ్చిన ఐపీఎస్ సీవీ ఆనంద్ తమ మాటలు వెనక్కి తీసుకున్నారు. జాతీయ మీడియాపై తాను చేసిన వ్యాఖ్యలపై క్షమాపణ చెప్పారు. జాతీయ మీడియాపై తనను కొన్ని ప్రశ్నలు అడిగినప్పుడు ప్రశాంతతను కోల్పోయి వ్యాఖ్యలు చేశాను. అందుకుగానూ క్షమాపణలు కోరుతున్నాను. పరిస్థితి ఎలా ఉన్నా సంయమనం పాటించాల్సి ఉంటుంది. నేను చేసిన తప్పిదంగా భావించి, నా వ్యాఖ్యలను మనస్ఫూర్తిగా వెనక్కి తీసుకుంటున్నాను అని ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేసి వివాదానికి స్వస్తి పలికారు.
శ్రీతేజ్ కోసం అల్లు అర్జున్ కీలక నిర్ణయం
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనలో గాయపడి ప్రాణాలతో పోరాటం చేస్తున్న శ్రీతేజ్ కోసం.. అల్లు అర్జున్ కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. డైరెక్టర్ సుకుమార్, మైత్రి మూవీ మేకర్స్‌తో కలిసి శ్రీతేజ్ కోసం.. దాదాపు రూ.2 కోట్లతో ట్రస్టు ఏర్పాటు చేయనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ మొత్తాన్ని శ్రీతేజ్ వైద్యం, భవిష్యత్ కోసం ఖర్చు చేయనున్నట్లు అల్లు అర్జున్ ప్లాన్ చేస్తున్నారని సమాచారం.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com