HYD: డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు..

HYD: డ్రగ్స్ కేసులో హీరోయిన్ సోదరుడు..
X
టాలీవుడ్‌లో ప్రకంపనలు

హైదరాబాద్ లో తాజాగా వెలుగుచూసిన డ్రగ్స్ కేసులో ప్రముఖ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడి పేరు తెరపైకి రావడం కేవలం టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లోనూ చర్చనీయాంశంగా మారింది. ట్రూప్ బజార్‌కు చెందిన నితిన్ సింఘానియా, శ్రనిక్ సింఘ్వీ అనే ఇద్దరు వ్యాపారవేత్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరికి నలుగురు రెగ్యులర్ కస్టమర్లు ఉన్నారని, అందులో రకుల్ ప్రీత్ సింగ్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ అని తేలింది. అమన్‌ప్రీత్‌ పరారీలో ఉన్నాడు. అతడి కోసం ఈగల్‌ టీమ్‌, పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసులో ట్రూప్‌ బజార్‌కు చెందిన నితిన్‌ సింఘానియా, శ్రనిక్‌ సింఘ్వి అరెస్టులతో అమన్‌ప్రీత్‌ పేరు బయటకు వచ్చింది. ఈ ఇద్దరు వ్యాపారుల నుంచి అతడు డ్రగ్స్‌ కొన్నట్లు ఈగల్‌ టీమ్‌ గుర్తించింది. ఇద్దరు వ్యాపారుల నుంచి 43 గ్రాముల మాదకద్రవ్యాలను స్వాధీనం చేసుకుంది. గతేడాది కూడా అమన్‌ప్రీత్‌ సైబరాబాద్‌ పోలీసులకు పట్టుబడ్డాడు.

ఇద్దరు వ్యాపారవేత్తల నుంచి నటి సోదరుడు డ్రగ్స్ కొనుగోలు చేసినట్లు బయటపడింది. వీరి నుంచి 43 గ్రాముల కొకైన్ ఎండీఎంఏ (MDMA) డ్రగ్స్‌‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అలాగే టాలీవుడ్, బాలీవుడ్‌లో మంచి గుర్తింపు ఉన్న ప్రముఖ నటి సోదరుడి కోసం పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. కాగా.. గత సంవత్సరం కూడా డ్రగ్స్ కేసులో సైబరాబాద్ పోలీసులకు నటి సోదరుడు పట్టుబడిన విషయం తెలిసిందే.

Tags

Next Story