HYD: ఏఐ హబ్ గా హైదరాబాద్

అమెరికాకు చెందిన ప్రముఖ సాఫ్ట్వేర్ సేవల సంస్థ బ్లాక్‌బడ్ భారతదేశంలో తన మొట్టమొదటి కార్యాలయాన్ని హైదరాబాద్‌లో ప్రారంభించింది. గడిచిన ఏడాదిగా భారత మార్కెట్లో కార్యకలాపాలు నిర్వహిస్తున్న ఈ సంస్థకు, ఇది దేశంలో నెలకొల్పిన మొట్టమొదటి ఆఫీస్ కావడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ క్లయింట్లకు ఇన్నోవేషన్, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ (AI) ఇంటిగ్రేషన్, ప్రొడక్ట్ డెవలప్మెంట్ వంటి కీలక సేవలను అందించడానికి ఈ కొత్త కార్యాలయం వ్యూహాత్మక కేంద్రంగా పనిచేయనుంది. ఈ సెంటర్ ద్వారా బ్లాక్‌బడ్ తన అంతర్జాతీయ సేవలను విస్తరించనుంది. ఈ సందర్భంగా కంపెనీ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్, చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ కెవిన్ గ్రెగోయిర్ మాట్లాడుతూ, "ప్రపంచస్థాయి ప్రతిభా వ్యవస్థ, శక్తివంతమైన టెక్నాలజీ కల్చర్ కలిగిన హైదరాబాద్‌లో ఈ టెక్నాలజీ సెంటర్‌ను ఏర్పాటు చేయడం, అంతర్జాతీయ లీడర్‌గా ఎదిగేందుకు ఎంతగానో దోహదపడుతుంది" అని అన్నారు.
పోలీస్ ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల
రాష్ట్ర నిరుద్యోగులకు తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు(TSLPRB) శుభవార్త చెప్పింది. శుక్రవారం 60 ఉద్యోగాలకు నోటిఫికేషన్ విడుదల చేసింది. వీటిలో సైంటిఫిక్ ఆఫీసర్, సైంటిఫిక్ అసిస్టెంట్, లేబొరేటరీ టెక్నీషియన్, లేబొరేటరీ అటెండెంట్ పోస్టులున్నాయి. అభ్యర్థులు ఈ నెల 17 ఉదయం 8 గంటల నుంచి డిసెంబర్ 15 సాయంత్రం 5 గంటల వరకు వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. అర్హతలతో పాటు పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ను సందర్శించాలని తెలిపింది. నోటిఫికేషన్ పూర్తి వివరాల కోసం [https://www.tgprb.inలో](https://www.tgprb.inలో) చూడాలని అధికారులు తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

