HYD: దేశంలోనే తొలి లీప్‌ ఇంజిన్ ఎంఆర్‌వో సెంటర్‌

HYD: దేశంలోనే తొలి లీప్‌ ఇంజిన్ ఎంఆర్‌వో సెంటర్‌
X
హైదరాబాద్‌లో మరో అంతర్జాతీయ సంస్థ... వర్చ్‌వల్‌గా ప్రారంభించిన ప్రధాని మోదీ.. 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా తెలంగాణ

దే­శం­లో­నే తొలి అం­త­ర్జా­తీయ వి­మా­నాల మర­మ్మ­తు కేం­ద్రం హై­ద­రా­బా­ద్‌­లో ఏర్పా­టు అవు­తోం­ది. శం­షా­బా­ద్‌ సమీ­పం­లో­ని జీ­ఎం­ఆ­ర్ ఏరో­పా­ర్క్‌ (SEZ)లో ఫ్రా­న్స్‌­కు చెం­దిన ప్ర­ముఖ సం­స్థ సఫ్రా­న్ ఎయి­ర్‌­క్రా­ఫ్ట్ ఇం­జి­న్ సర్వీ­సె­స్ ఇం­డి­యా (SAESI) నె­ల­కొ­ల్పు­తు­న్న లీ­ప్‌ ఇం­జి­న్ ఎం­ఆ­ర్‌­వో (మె­యిం­టె­నె­న్స్‌, రి­పే­ర్‌, ఓవ­ర్‌­హా­ల్‌ - MRO) సెం­ట­ర్‌­ను ప్ర­ధా­ని నరేం­ద్ర మోదీ బు­ధ­వా­రం ఆన్ లైన్ ద్వా­రా ప్రా­రం­భిం­చా­రు. రఫే­ల్ వి­మా­నా­ల్లో ఉప­యో­గిం­చే M88 ఇం­జి­న్‌ కోసం ఏర్పా­టు చే­స్తు­న్న కొ­త్త ఎం­ఆ­ర్‌­వో యూ­ని­ట్‌­కు శం­కు­స్థా­పన చే­శా­రు. ఈ కా­ర్య­క్ర­మా­ని­కి తె­లం­గాణ రా­ష్ట్ర ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి, కేం­ద్ర మం­త్రి రా­మ్మో­హ­న్ నా­యు­డు, రా­ష్ట్ర మం­త్రి శ్రీ­ధ­ర్ బాబు హా­జ­ర­య్యా­రు. ఈ కొ­త్త సదు­పా­యం ఏరో­స్పే­స్, రక్షణ రం­గం­లో తె­లం­గాణ వృ­ద్ధి­కి ఒక మై­లు­రా­యి­గా ని­లు­స్తుం­ది. ఇది భా­ర­త­దే­శం­లో లీ­ప్‌ ఇం­జి­న్‌ల మొ­ట్ట­మొ­ద­టి మె­యిం­టె­నె­న్స్, రి­పే­ర్, ఓవర్ హాల్ (MRO) సెం­ట­ర్. రూ.1,300 కో­ట్ల పె­ట్టు­బ­డి­తో ఏర్పా­టు చే­సిన ఈ సదు­పా­యం­తో 1,000 మం­ది­కి పైగా నై­పు­ణ్యం కలి­గిన సాం­కే­తిక ని­పు­ణు­లు, ఇం­జ­నీ­ర్ల­కు ఉపా­ధి లభి­స్తుం­ది.

ఈ సం­ద­ర్భం­గా ము­ఖ్య­మం­త్రి రే­వం­త్ రె­డ్డి మా­ట్లా­డు­తూ తె­లం­గా­ణ­పై నమ్మ­కం­తో హై­ద­రా­బా­ద్‌­ను ఎం­చు­కు­న్న సఫ్రా­న్‌­కు అభి­నం­ద­న­లు తె­లి­పా­రు. ఇది మన స్థా­నిక ఎం­ఎ­స్ఎం­ఈ­ల­కు, ఇం­జ­నీ­రిం­గ్ కం­పె­నీ­ల­కు కొ­త్త వ్యా­పార అవ­కా­శా­ల­ను కల్పి­స్తుం­ద­న్నా­రు. ఈ వి­మా­నాల మర­మ్మ­తు కేం­ద్రం భారత వై­మా­నిక, నా­వి­కా­ద­ళా­ని­కి ఎంతో ఉప­యో­గ­ప­డు­తుం­ద­న్నా­రు. హై­ద­రా­బా­ద్ దే­శం­లో­ని ప్ర­ధాన ఏరో­స్పే­స్, డి­ఫె­న్స్ హబ్ ని­లి­చిం­ద­న్నా­రు. తె­లం­గా­ణ­లో 25 కంటే ఎక్కువ ప్ర­ధాన ప్ర­పంచ కం­పె­నీ­లు, 1,500 కి పైగా ఎం­ఎ­స్ఎం­ఈ­లు ఉన్నా­య­ని సీఎం రే­వం­త్‌ రె­డ్డి పే­ర్కొ­న్నా­రు. తమ ప్ర­గ­తి­శీల పా­రి­శ్రా­మిక వి­ధా­నం, ఎం­ఎ­స్ఎంఈ వి­ధా­నం దే­శం­లో­నే అత్యు­త్త­మ­మైన వా­టి­లో ఒక­టి­గా ని­లి­చిం­ద­న్నా­రు. ప్ర­పంచ స్థా­యి మౌ­లిక సదు­పా­యా­లు, ఏరో­స్పే­స్ పా­ర్కు­లు, SEZ­లు ప్ర­ముఖ ప్ర­పంచ కం­పె­నీల నుం­డి అనేక భారీ పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చా­య­న్నా­రు. సఫ్రా­న్, బో­యిం­గ్, ఎయి­ర్ బస్, టాటా, భా­ర­త్ ఫో­ర్జ్ వంటి సం­స్థ­లు హై­ద­రా­బా­ద్‌­ను తయా­రీ, పరి­శో­ధన, అభి­వృ­ద్ధి కోసం ఎం­చు­కు­న్నా­య­ని, హై­ద­రా­బా­ద్‌ భా­ర­త­దే­శం­లో­ని ప్ర­ముఖ ఎం­ఆ­ర్‌­వో, ఏరో ఇం­జి­న్ హబ్‌­ల­లో ఒక­టి­గా ని­లి­చిం­ద­న్నా­రు.

ఏరో­స్పే­స్, రక్షణ రం­గం­లో మన ఎగు­మ­తు­లు గత ఏడా­ది రె­ట్టిం­పు అయ్యా­య­ని, 9 నె­ల­ల్లో రూ.30,742 కో­ట్ల­కు చే­రు­కు­న్నా­య­ని, మొ­ద­టి­సా­రి­గా మన ఫా­ర్మా ఎగు­మ­తు­ల­ను అధి­గ­మిం­చా­య­ని వి­వ­రిం­చా­రు. ఏరో­స్పే­స్ పె­ట్టు­బ­డు­ల­ను ఆక­ర్షిం­చ­డా­ని­కి నై­పు­ణ్యం చాలా ము­ఖ్య­మైన ప్ర­మా­ణ­మ­న్న రే­వం­త్‌ రె­డ్డి.. టాటా టె­క్నా­ల­జీ­స్ భా­గ­స్వా­మ్యం­తో తె­లం­గాణ 100 ఇం­డ­స్ట్రి­య­ల్ ట్రై­నిం­గ్ ఇన్ స్టి­ట్యూ­ట్‌­ల­ను అడ్వా­న్స్ డ్ టె­క్నా­ల­జీ సెం­ట­ర్లు­గా అప్ గ్రే­డ్ చే­సిం­ద­న్నా­రు.తమ యంగ్ ఇం­డి­యా స్కి­ల్స్ యూ­ని­వ­ర్శి­టీ వి­మా­నాల ని­ర్వ­హణ కోసం ప్ర­త్యేక శి­క్ష­ణ­పై దృ­ష్టి పె­డు­తుం­ద­న్నా­రు. 30 వేల ఎక­రాల వి­స్తీ­ర్ణం­లో భా­ర­త్‌ ఫ్యూ­చ­ర్ సి­టీ­ని ని­ర్మి­స్తు­న్నా­మ­న్న సీఎం రే­వం­త్‌ , తమ వి­జ­న్‌­ను ఆవి­ష్క­రిం­చ­డా­ని­కి డి­సెం­బ­ర్ 8, 9 తే­దీ­ల్లో భా­ర­త్ ఫ్యూ­చ­ర్ సి­టీ­లో జరి­గే తె­లం­గాణ రై­జిం­గ్ 2047 – గ్లో­బ­ల్ సమ్మి­ట్‌­కు అం­ద­రి­నీ ఆహ్వా­ని­స్తు­న్నా­న­న్నా­రు. 2035 నా­టి­కి 1 ట్రి­లి­య­న్ డా­ల­ర్లు, 2047 నా­టి­కి 3 ట్రి­లి­య­న్ డా­ల­ర్ల ఎకా­న­మీ­గా తె­లం­గా­ణ­ను తీ­ర్చి­ది­ద్దా­ల­ని తాము ప్ర­య­త్ని­స్తు­న్నా­మ­ని, బెం­గ­ళూ­రు-హై­ద­రా­బా­ద్ ను డి­ఫె­న్స్ అండ్ ఏరో­స్పే­స్ కా­రి­డా­ర్‌­గా ప్ర­క­టిం­చా­ల­ని ప్ర­ధా­న­మం­త్రి­కి వి­జ్ఞ­ప్తి చేశారు.

Tags

Next Story