Hyderabad : న్యూ ఇయర్ పార్టీకి వెళుతున్నారా! ఈ రూల్స్ ఉల్లంఘిస్తే నేరుగా జైలుకే మరి...
Hyderabad

Hyderabad : న్యూ ఇయర్ పార్టీకి వెళుతున్నారా! ఈ రూల్స్ ఉల్లంఘిస్తే నేరుగా జైలుకే మరి...
న్యూ ఇయర్ వేడుకల నేపథ్యంలో హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలో పోలీసులు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. డిసెంబర్ 31న రాత్రి 10 గంటల నుంచి జనవరి 1 తెల్లవారుజామున 2 గంటల వరకు ఈ ఆంక్షలు అమల్లో ఉంటాయి. నిబంధనలను అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని సీపీ సీవీ ఆనంద్ స్పష్టం చేశారు. పలు రోడ్లు, ఫ్లైఓవర్లపై వాహనాలు రాకపోకాలను నిషేధించడంతో పాటు, డ్రంక్ అండ్ డ్రైవ్ పై కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.
న్యూఇయర్ వేడుకల సందర్భంగా హైదరాబాద్ లో ట్రాఫిక్ ఆంక్షలు అమలు చేశారు పోలీసులు. ట్యాంక్ బండ్ చుట్టూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఎన్టీఆర్ మార్గ్, అప్పర్ ట్యాంక్ బండ్ పైకి వాహనాలకు అనుమతి లేదని తెలుపుతున్నారు. కొత్త సంవత్సరం సందర్భంగా పలుచోట్ల తనిఖీలు నిర్వహించేందుకు సిద్దమైయ్యారు. అంతేకాకుండా కొత్త ఏడాది ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారిపై చర్యలు తప్పనిసరి అంటూ హెచ్చరికలు జారీ చేశారు.
ఖైరతాబాద్ మీదుగా నెక్లెస్ రోడ్, ఎన్టీఆర్ మార్గ్ వైపు వెళ్లే వాహనాలను నిరంకారి భవన్, రాజ్‌భవన్ రోడ్డు మీదుగా మళ్లించనున్నారు. హుస్సేన్ సాగర్ పరిసర ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆంక్షలు షురూ చేయనున్నారు. ఇక వాహనదారులు పై నిభందనల పాటించాలని పోలీస్ యంత్రాంగం కోరింది. ట్రాఫిక్ ఉల్లంఘనలపై డిసెంబరు 31న నగరంలో స్పెషల్ డ్రైవ్ చేపడతామని నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com