Hyderabad: డెడ్ లైన్... జూపార్క్‌ ఫ్లై ఓవర్ పనుల్లో జోరు.. మార్చికే ముహూర్తం..

Hyderabad: డెడ్ లైన్... జూపార్క్‌ ఫ్లై ఓవర్ పనుల్లో జోరు.. మార్చికే ముహూర్తం..
ఫ్లై ఓవర్ పూర్తి అయితే ఆరంఘంర్‌ నుంచి జూ పార్క్‌ వైపు భారీగా తగ్గనున్న ట్రాఫిక్‌: మార్చ్ లోగా పనులు పూర్తి....

హైదరాబాద్‌ సిగలో మెరిసేందుకు మరో ఫ్లైఓవర్‌ సిద్ధమౌతోంది. ఆరంఘర్‌ నుంచి జూపార్క్‌ వరకు నిర్మితమౌతోన్న ఈ ఫ్లైఓవర్‌ను ఈ ఏడాది మార్చ్‌ వరకు పూర్తి చేయాలని సీఎస్‌ సోమేశ్‌ శర్మ గతేడాది ఆదేశించారు. దీంతో గడువు దగ్గర పడుతుండగా పనులు ఊపందుకున్నాయి.

ఫ్లైఓవర్‌ను రూ. 636.80 కోట్ల అంచనాతో, మొత్తం 119 పిల్లర్లతో 4.08 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్నారు. పనులు పూర్తి అయితే పీవీ నర్సింహారావు ఎక్స్‌ప్రెస్‌ వే తరువాత రెండవ అతి పెద్దదైన ఫ్లైఓవర్‌ ఇదే అవుతుంది.

ఈ ఆరు లేన్ల ఫ్లైఓవర్‌ పూర్తి అయితే ఏయిర్‌పోర్ట్‌, మహబూబ్‌నగర్‌, కర్నూల్‌, అనంతపూర్‌, బెంగళూరు నుంచి వచ్చే వాహనదారులకు దూరాభారం గణనీయంగా తగ్గుతుందని అంచనా.

Tags

Next Story