Hyderabad : ఇందిరాపార్క్‌ వద్ద కాంగ్రెస్‌ ధర్నాకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

Hyderabad : ఇందిరాపార్క్‌ వద్ద కాంగ్రెస్‌ ధర్నాకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌
X
సర్పంచ్‌ల సమస్యలపై నిరసన చేపట్టనున్న కాంగ్రెస్‌; 300మందితో ధర్నా

రాష్ట్రంలో సర్పంచ్‌ల సమస్యల గురించి ఇందిరా పార్క్‌ వద్ద దర్నా చౌక్‌లో నిరసన తెలిపేందుకు కాంగ్రెస్‌ పార్టీకి తెలంగాణ హైకోర్లు అనుమతి ఇచ్చింది. హైదరాబాద్‌ పోలీస్‌ కమీషనర్‌కు కాంగ్రెస్ పార్టీకీ అనుమతి ఇవ్వాలని విజయ్ సేన్‌రెడ్డి బృందంతో కూడిన దర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

300 వందల మందితో మాత్రమే ధర్నాను నిర్వహించాలని, కోవిడ్ నిబంధనలు తప్పక పాటించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది. ఇటీవలే కాంగ్రెస్‌ పార్టీ ధర్నాకు అనుమతి కోరగా పోలీసులు అంగీకరించకపోవడంతో పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్ అశోక్‌ కుమార్‌ గౌడ్‌ హైకోర్టును ఆశ్రయించారు. దీంతో ప్రభుత్వ తరుపు న్యాయవాది ప్రజలకు ఇబ్బంది కలుగుతుందని, అనుమతి ఇవ్వకూడదని వాదించగా నిరసనలకు అనిమతి ఇవ్వకపోవడం అప్రజాస్వామ్యం అవుతుందని ధర్మాసనం తెలియజేసింది.

Tags

Next Story