Hyderabad: నగరంలో చైన్ స్నాచర్ల వీరంగం

Hyderabad: నగరంలో చైన్ స్నాచర్ల వీరంగం
X
గంటల వ్యవధిలో ఆరుచోట్ల చోరి; రంగంలోకి దిగిన పోలీస్ యంత్రాంగం

హైదరాబాద్‌లో చైన్‌స్నాచర్స్‌ బెడద రోజు రోజుకు పెచ్చుమీరుతుంది. దీంతో నగరంలోని మహిళలు బయటికి రావాలంటేనే హడలిపోతున్నారు. కనీవినీ ఎగురని రీతిలో ఈ రోజు ఉదయమే నగరంలోని ఆరు చోట్ల చైన్ స్నాచింగ్ లు జరగడం పోలీసులును సైతం విస్మయానికి గురిచేసింది.


ఈ రోజు ఉదయం నుంచే రంగంలోకి దిగిన చైన్ స్నాచర్లు... గంటల వ్యవధిలోనే ఆరు చోట్ల చోరీకి పాల్పడ్డారు. ఓయూ, ఉప్పల్‌, రావుగోపాల్‌నగర్‌ ప్రాంతాల్లో మాటు వేసి ఆరుగురి మహిళలపై తెగబడి వారి మెడలోని చైన్లను లాక్కెళ్లారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు వారికోసం గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ కేసులను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్న పోలీసులు వీలైనంత త్వరగా నిందితులను పట్టుకుంటామని తెలిపారు.





Tags

Next Story